తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల అయితన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. టీఎస్పీఎస్సీ నుంచి రెండు అప్ డేట్స్ వచ్చాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 31, 2022న తెలంగాణ రవాణ శాఖలోని అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 113 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1 న ముగిసింది. అయితే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ దరఖాస్తులోని తప్పుల సవరణలకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు. మార్చి 09, 2023 నుంచి మార్చి 11, 2023 మధ్య తమ దరఖాస్తులను సవరించుకోవచ్చని టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది.
మరో నోటిఫికేషన్ ప్రకారం..
వీటితో పాటు.. టీఎస్పీఎస్సీ మరో అప్ డేట్ తీసుకొచ్చింది. మొత్తం 175 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు మొత్తం 33,342మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్క పోస్టుకు 190 మంది పోటీ పడుతున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మార్చి 12, 2023గా నిర్ణయించారు. అయితే రేపటి నుంచి (మార్చి 06) ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి వెబ్ నోట్ టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.
ఇక ఇటీవల టీఎస్పీఎస్సీ వెల్లడించిన పరీక్ష తేదీల వివరాలిలా..
1. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్
పరీక్ష తేదీ ఏప్రిల్ 23, 2023
2. గ్రూప్ 3
పరీక్ష తేదీ ఆగస్టు / సెప్టెంబర్ నెలలో.. దీనికి తేదీని త్వరలో వెల్లడించాల్సి ఉంంది.
3.గ్రూప్ 4
పరీక్ష తేదీ.. జూలై 01, 2023
4.గ్రూప్ 2
పరీక్ష తేదీ.. ఆగస్టు 29, 30
5. అగ్రికల్చర్ ఆఫీసర్
పరీక్ష తేదీ.. ఏప్రిల్ 25, 2023
6.గ్రూప్ 1 మెయిన్స్
మెయిన్స్ పరీక్షలు జూన్ 5 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్నారు.
7.పాలిటెక్నిక్ లెక్చరర్స్
పరీక్ష తేదీ.. మే 13, 2023
8. భూగర్భ జల వనరుల శాఖ (గెజిటెడ్)
పరీక్ష తేదీ.. ఏప్రిల్ 26, 27
9.భూగర్భ జల వనరుల శాఖ (నాన్ గెజిటెడ్)
పరీక్ష తేదీ.. మే 15, 16
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Jobs in telangana, TSPSC, Tspsc jobs