Home /News /jobs /

ADMISSIONS IN 8TH CLASS OF RASHTRIYA INDIAN MILITARY COLLEGE LEARN THE APPLICATION PROCESS AND EXAMINATION PROCEDURE GH VB

RIMC Admissions: మిలిటరీ కాలేజ్ 8వ తరగతిలో ప్రవేశాలు.. దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష విధానం ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC)లో అడ్మిషన్ కోసం చేపట్టిన రిజిస్ట్రేషన్ త్వరలో ముగియనుంది. 8వ తరగతి అడ్మిషన్ల కోసం చేపట్టిన ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC)లో అడ్మిషన్ కోసం చేపట్టిన రిజిస్ట్రేషన్(Registration) త్వరలో ముగియనుంది. 8వ తరగతి అడ్మిషన్ల కోసం చేపట్టిన ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దరఖాస్తు(Application) చేసుకోవడానికి చివరి తేదీని ఏప్రిల్ 25గా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ rimc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తరగతులు జనవరి 2023 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం RIMC ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుంది. ఈ పరీక్షలో గణితం, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడగనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్(Entrance Test) జూన్ 4న సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నారు. గణితం పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, జీకే (General Knowledge) మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు, ఇంగ్లిష్‌ పరీక్ష(English exam) మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ వైవా-వాయిస్ రౌండ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు ఇంగ్లిష్ లేదా హిందీలో సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది.

15 సెకన్ల పాటు ఈ చిలుక కళ్లలోకి చూడండి ..అద్భుతమైన మార్పును చూస్తారు..


* అర్హత ప్రమాణాలు
ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న అభ్యర్థులు లేదా ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుండి ఏడో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 2, 2010 నుంచి జూలై 1, 2011 మధ్య విద్యార్థులు జన్మించి ఉండాలి. ప్రస్తుతం వారి వయస్సు తప్పనిసరిగా పదకొండున్నర నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.

* అడ్మిషన్‌కు అవసరమైన పత్రాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌లో 8వ తరగతిలో అడ్మిషన్ తీసుకోవాలంటే విద్యార్థుల బర్త్ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్, ప్రస్తుతం చదువుతున్న స్కూల్ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, రెండు పాస్ట్ పోర్ట్ సైజ్ ఫొటోలను సమర్పించాల్సి ఉంటుంది.

* దరఖాస్తు విధానం

స్టెప్1: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి

స్టెప్‌2: అందులోని హోమ్ పేజీలో అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి

స్టెప్3: మీ వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫారంను పూరించండి

స్టెప్4: అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి పరీక్ష ఫీజును చెల్లించండి

స్టెప్5: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫారంను సేవ్ చేయండి, డౌన్‌లోడ్ కూడా చేసుకోండి.

* అప్లికేషన్ ఫీజు వివరాలు
జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.555 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఒకవేళ డీడీ అయితే ఈ అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెల్ భవన్, డెహ్రాడూన్ (బ్యాండ్ కోడ్-01576), ఉత్తరాఖండ్ కు పంపాల్సి ఉంటుంది.

ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రం మీ లవ్ సీక్రెట్ ఏంటో చెబుతుంది..


* పరీక్ష విధానం
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లో మ్యాథమెటిక్స్ పేపర్ 200 మార్కులకు, జీకే 75 మార్కులకు, ఇంగ్లిష్ 125 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్‌లో కనీస ఉత్తీర్ణత మార్కులు 50 శాతంగా నిర్ణయించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను వైవా కోసం పిలుస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. ఫలితాలు RIMC వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఫలితం వచ్చిన 10 రోజుల్లోగా RIMCలో చేరాలి. అలాగే వైద్య పరీక్షలను చేయించుకోవాలని RIMC తెలిపింది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Rims, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు