ఇటీవల కాలంలో మీడియా (Media) బాగా విస్తృతమైంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ రంగాలతో పాటు డిజిటల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందింది. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో ఈ రంగంలో కెరీర్ ప్రారంభించేందుకు యువత ఆసక్తి చూపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలు ఇన్‌స్టిట్యూట్‌లు జర్నలిజంపై యూజీ, పీజీ కోర్సులను అందిస్తున్నాయి. తాజాగా కోయంబత్తూరులోని అమృత విశ్వ విద్యాపీఠం మాస్ కమ్యూనికేషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (BA), పోస్ట్ గ్రాడ్యుయేట్ (MA) ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ aoap.amrita.edu ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అడ్మిషన్ ప్రాసెస్, అర్హతప్రమాణాలు
2023-24 అకడమిక్ సెషన్ కోసం అడ్మిషన్ ప్రాసెస్ హైబ్రిడ్ మోడల్ లో ఉంటుంది. ప్రధానంగా ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్‌మిషన్, ఆఫ్‌లైన్ ఎంట్రెన్స్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, సీటు అలాట్మెంట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ కొనసాగనుంది. బీఏ మాస్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ కోసం ఏదైనా విభాగంలో ఇంటర్ సెకండియర్‌లో కనీసం 50 శాతం స్కోర్ చేసి ఉండాలి. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ కోసం ఏదైనా విభాగంలో యూజీ కోర్సుల్లో 50 శాతం స్కోర్ చేసి ఉండాలి.
* కోర్సుల వివరాలు
ప్రోగ్రామ్‌లలో భాగంగా ప్రింట్ జర్నలిజం, మల్టీమీడియా అండ్ ఆన్‌లైన్ జర్నలిజం, ఫోటోగ్రఫీ, టెలివిజన్ ప్రొడక్షన్, వెబ్ డిజైన్ అండ్ యానిమేషన్, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ వంటి అంశాలపై కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. కోర్ మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్, హ్యుమానిటీస్ (సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్), ఓపెన్ ఎలక్టివ్స్ (సామాజిక బాధ్యత, భారతీయ స్పృహను పెంపొందించడంపై దృష్టి సారించడం) సంబంధించిన మాడ్యూల్స్ కలయికతో కోర్సులు ఉండనున్నాయి.
* వర్క్‌షాప్స్, ఎక్స్‌పర్ట్స్ లెక్చర్స్, ఫీల్డ్ విజిట్స్
ఇండస్ట్రీ-అకడమిక్ కనెక్షన్‌ను ప్రోత్సహించడానికి, ప్రోగ్రామ్‌లలో భాగంగా ఇన్- బిల్ట్ మీడియా బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆన్‌లైన్ అండ్ బ్రాండ్‌కాస్టింగ్ ఆప్షన్స్ (పోర్ట్‌ఫోలియో మెరుగుదల- పరిశ్రమ సహకారంతో), మల్టి-డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్, వన్ సెమిస్టర్-లాంగ్ మ్యాండెటరీ ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర, కార్పొరేట్, మీడియా సంస్థలతో కలిసి పని చేయడానికి అవకాశాలను పొందుతారు. స్కిల్స్ మెరుగుదల కోసం వర్క్‌షాప్స్, ఎక్స్‌పర్ట్స్ లెక్చర్స్, జాబ్ ట్రైనింగ్, ఫీల్డ్ విజిట్స్ వంటివి ఉంటాయి. కాగా, అమృత యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ విభాగం అందించే BA మాస్ కమ్యూనికేషన్, MA కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ మీడియా ఎడ్యుకేషన్ కోసం యునెస్కో మోడల్ పాఠ్యాంశాలను అనుసరించనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Coimbatore, EDUCATION, JOBS, New courses