హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Accenture: బీటెక్ ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్.. యాక్సెంచర్ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్ ప్రారంభం.. జీతం రూ. 4.5 లక్షలు..

Accenture: బీటెక్ ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్.. యాక్సెంచర్ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్ ప్రారంభం.. జీతం రూ. 4.5 లక్షలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Accenture: ఎంపికైన అభ్యర్థులు బిజినెస్ అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్‌లను ఉపయోగించి డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్, కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సంస్థ పనితీరును గణనీయంగా ప్రభావితం చేసేలా, అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించే వ్యాపార డ్రైవ్ లను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మల్టీనేషనల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసెస్, అవుట్‌సోర్సింగ్ సంస్థ ‘యాక్సెంచర్’ (Accenture).. PWD- అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (ASE) పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్ www.accenture.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు (Apply) చేసుకోవచ్చు. బీఈ, బీటెక్-సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ చదువుతున్న లేదా పూర్తిచేసిన ప్రెషర్స్ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 2020, 2021, 2022 ఎంసీఏ బ్యాచ్‌ల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ ఆఫీస్‌లు ముంబయి, పూణే, బెంగళూరు, చెన్నై, గుర్గావ్, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్నాయి.‘క్లయింట్స్, వరల్డ్ వర్క్ విధానాన్ని మెరుగుపరిచే సాంకేతికతల అభివృద్ధి, డిజైన్, మెయింం‌టెన్ కోసం మా టీమ్‌లో చేరండి. ఛాలెంజింగ్, డైనమిక్ వాతావరణంలో పని చేయడం, అనాలసిస్ నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు క్లయింట్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ సొల్యూషన్స్ క్రియేట్ చేయడంలో సపోర్ట్ కోసం అభ్యర్థుల సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటాం.’ అని సంస్థ పేర్కొంది.
ఎంపికైన అభ్యర్థులు బిజినెస్ అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్‌లను ఉపయోగించి డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్, కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సంస్థ పనితీరును గణనీయంగా ప్రభావితం చేసేలా, అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించే వ్యాపార డ్రైవ్ లను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు మంచి అనలైటికల్, ప్రాబ్లమ్-సాల్వింగ్ స్కిల్స్, నేర్చుకోవాలనే ఆసక్తి, కమ్యూనికేషన్‌లో సామర్థ్యం ఉన్న అభ్యర్థులను కంపెనీ కోరుకుంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 4,50,000 వరకు జీతం లభిస్తుంది.


కాగా, యాక్సెంచర్.. డిజిటల్, క్లౌడ్, సెక్యూరిటీ విభాగంలో అగ్రగ్రామి సంస్థ. ఈ సంస్థకు ఉన్న 6,24,000 మంది ఉద్యోగులు.. కోరుకున్న సాంకేతికత, హ్యుమన్ ఇమ్యాజిన్‌లను అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సంస్థ 120 కంటే ఎక్కువ దేశాల్లోని క్లయింట్లకు సేవలందిస్తోంది.
ఇది కూడా చదవండి : ఇంటర్ పూర్తి చేశారా.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఈ ఉద్యోగాలు మీ కోసమే..
మరోవైపు, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ పెట్టుబడి విభాగమైన యాక్సెంచర్ వెంచర్స్, ఇండియన్ స్పేస్-టెక్ స్టార్టప్, Pixxelలో వ్యూహాత్మక పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో ఫిక్సెల్ $25 మిలియన్ల సిరీస్ A నిధుల సేకరణకు వెళ్లింది. దీంతో కెనడాకు చెందిన రాడికల్ వెంచర్స్ మార్చిలో Pixxel నిధుల రౌండ్‌కు నాయకత్వం వహించింది. ఆ తరువాత ఇండియన్ స్పేస్-టెక్ స్టార్టప్‌ Pixxelలో పెట్టుబడి పెట్టిన రెండో గ్లోబల్ ఫండ్‌గా యాక్సెంచర్ వెంచర్స్ నిలిచింది.
టెక్​ దిగ్గజం యాక్సెంచర్‌, భారత్‌లోని వివిధ నగరాల్లోని తమ ఆఫీస్‌ల్లో కామర్స్​ గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకుంటుంది. ఇన్వాయిస్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్​, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో చెల్లింపుల నిర్వహణ కోసం వీరిని ఉపయోగించుకోనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, Freshers, JOBS

ఉత్తమ కథలు