Home /News /jobs /

ACADEMIC EVENTS FROM CBSE BOARD EXAMINATIONS TO NEET NOTIFICATION MAJOR ACADEMIC EVENTS IN APRIL DETAILS HERE GH VB

Academic Events: బోర్డు పరీక్షల నుంచి నీట్‌(NEET) వరకు.. ఏప్రిల్‌లో మేజర్‌ అకడమిక్‌ ఈవెంట్స్‌ ఇవే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ నెలలో చాలా అకడమిక్‌ ఈవెంట్స్‌ను ప్రకటించబోతున్నారు. ఏప్రిల్‌లో ప్రకటించబోయే విద్య సంబంధిత కార్యక్రమాల వివరాలు ఇవే..

ఈ నెలలో చాలా అకడమిక్‌ ఈవెంట్స్‌ను ప్రకటించబోతున్నారు. అందులో మొదటిసారిగా నిర్వహిస్తున్న సింగిల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ CUET(Central Universities Entrance Test) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తేదీలు, 30 లక్షల మందికి పైగా విద్యార్థులు రాయనున్న సీబీఎస్‌ఈ బోర్డ్ పరీక్షల ప్రారంభం, జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష JEE మెయిన్‌ వంటివి ఉన్నాయి. ఏప్రిల్‌లో ప్రకటించబోయే విద్య సంబంధిత కార్యక్రమాల వివరాలు ఇవే.. మొట్టమొదటిసారిగా CUET అడ్మిషన్లు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA-National Testing Agency) మొట్టమొదటిసారిగా సెంట్రల్ యూనివర్శిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభం కావాల్సి ఉండగా.. ఏప్రిల్ 6కి వాయిదా పడింది. JNU, DU వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు జులై మొదటి, రెండో వారంలో నిర్వహిస్తారు.

JEE మెయిన్ అడ్మిట్ కార్డ్: JEE మెయిన్ 2022 మొదటి సెషన్ అడ్మిట్ కార్డ్ ఏప్రిల్ మూడో వారంలో విడుదల అవుతుంది. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి సెషన్ ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీలలో జరగనున్నాయి. JEE మెయిన్ 2022 ఈ సంవత్సరం రెండు సెషన్‌లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్ 5న మముగుస్తుంది. ఆ తర్వాత రెండో సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెషన్ 2 మే 24, 25, 26, 27, 29 తేదీల్లో నిర్వహిస్తున్నారు.

మధ్యప్రదేశ్ బోర్డు ఫలితాలు: మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (MPBSE).. 10, 12వ తరగతుల ఫలితాలను ఏప్రిల్ చివరి లేదా మే మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 12న ముగిసిన బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియ మార్చి ప్రారంభంలోనే ప్రారంభమైంది. ఫలితాలు ముందుగానే విడుదల కావాల్సి ఉండగా ప్రశ్నపత్రాల్లో తప్పుల కారణంగా జాప్యం నెలకొంది. రెండు తరగతులకు చెందిన ఆరు సబ్జెక్టు పేపర్లలో కొన్ని తప్పు ప్రశ్నలు ఉన్నట్లు ఎంపీ బోర్డు గుర్తించింది. 10వ తరగతి మ్యాథ్స్ పేపర్, 12వ తరగతి కెమిస్ట్రీ పేపర్లలో చాలా తప్పులు ఉన్నాయి. ఈ పేపర్లకు గ్రేస్ మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

CUET 2022: ఏప్రిల్ 6 నుంచి సీయూఈటీ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. కానీ ఆ విషయంలో మాత్రం నో క్లారిటీ..


CISCE బోర్డు పరీక్షలు: CISCE బోర్డ్ పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమై జూన్ 13న ముగుస్తాయి. సెమిస్టర్ 2 పరీక్షలు 1.5 గంటల పాటు జరుగుతాయి. ప్రశ్నపత్రం చదవడానికి విద్యార్థులకు 10 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్ష రోజున విద్యార్థులకు మధ్యాహ్నం 1:50 గంటలకు ప్రశ్నపత్రం అందజేస్తారు.

CBSE బోర్డు పరీక్షలు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 2 క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమవుతాయి. రెండు తరగతులకు పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. 15 నిమిషాల రీడింగ్‌ టైమ్‌ ఇస్తారు. మిగిలిన 50 శాతం సిలబస్‌ నుంచి పరీక్షకు ప్రశ్నలు వస్తాయి. గత సంవత్సరం నవంబర్-డిసెంబర్‌లో జరిగిన టర్మ్ 1 పరీక్షల సమయంలో సిలబస్‌లోని మొదటి సగం పూర్తయింది. టర్మ్ 2 పరీక్షలు సబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. తుది ఫలితం టర్మ్ 1 ఫలితాలు, టర్మ్ 2 మార్కులు, ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు కలిపి ఉంటాయి.

NEET 2022 నోటిఫికేషన్: NTA నుంచి తదుపరి నోటిఫికేషన్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NEET) 2022ది ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. అయితే ఖచ్చితమైన తేదీ తెలియదు. ఇప్పుడు CUET 2022 వాయిదా వేయడంతో, ఏప్రిల్ 6 తర్వాత NEET 2022 రిజిస్ట్రేషన్ విండో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జులై 17న మెడికల్ ఎంట్రన్స్ నిర్వహించే సూచనలు ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, CBSE, Cuet, NEET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు