హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Airport Jobs: ఎయిర్‌పోర్ట్ కార్గోలో 400 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు

Airport Jobs: ఎయిర్‌పోర్ట్ కార్గోలో 400 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు

Airport Jobs: ఎయిర్‌పోర్ట్ కార్గోలో 400 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Airport Jobs: ఎయిర్‌పోర్ట్ కార్గోలో 400 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Airport Jobs | ఎయిర్‌పోర్ట్ కార్గోలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) 400 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

డిగ్రీ పాసైనవారికి అలర్ట్. ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల్ని (Security Screener Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 400 ఖాళీలు ఉన్నాయి. భారతదేశంలో వేర్వేరు చోట్ల ఈ పోస్టులు ఉన్నాయి. పోస్టింగ్ ఎక్కడ లభిస్తుందన్నది కంపెనీ నిర్ణయిస్తుంది.

ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇవి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు . కాంట్రాక్ట్ గడువు మూడేళ్లు ఉంటుంది. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. 2023 మార్చి 19 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్‍‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! 5,369 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌! అర్హ‌త‌లు ఇవే..

AAICLAS Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

భర్తీ చేసే పోస్ట్ పేరు- సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్)

దరఖాస్తు ప్రారంభం- 2023 మార్చి 8

దరఖాస్తుకు చివరి తేదీ- 2023 మార్చి 19

ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్

విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాస్ కావాలి.

వయస్సు- 2023 మార్చి 19 నాటికి 27 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలకు ఫీజు లేదు.

వేతనం- మొదట నెలకు రూ.15,000 స్టైపెండ్ లభిస్తుంది. ట్రైనింగ్, సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్స్ పూర్తి చేసినవారికి మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.32,000, మూడో ఏడాది రూ.34,000. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

B Tech Jobs: బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా.. అయితే ఈ జాబ్స్ మీ కోసమే.. ఓ లుక్కేయండి..

AAICLAS Recruitment 2023: అప్లై చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా AAICLAS అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

Step 2- ఆ తర్వాత సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.

Step 3- అభ్యర్థులు తమ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌, బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 4- లాగిన్ చేసిన తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

Step 5- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 6- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

First published:

Tags: Airport, Airport jobs, JOBS

ఉత్తమ కథలు