హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In AAI: AAIలో అసిస్టెంట్ పోస్టులు.. 10th, Inter, Degree అర్హత..

Jobs In AAI: AAIలో అసిస్టెంట్ పోస్టులు.. 10th, Inter, Degree అర్హత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు AAI యొక్క aai.aero వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అంటే సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్బెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ (AAI రిక్రూట్‌మెంట్ 2022) ప్రక్రియ ద్వారా మొత్తం 156 పోస్టులు భర్తీ చేయనున్నారు.

మొత్తం నాలుగు విభాగాల్లో 156 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

S. Noపోస్టు పేరుఖాళీల సంఖ్య
1జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్)132
2జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్)10
3సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)13
4సీనియర్ అసిస్టెంట్ (Official Language)01

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) : అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 3 సంవత్సరాల ఆటోమొబైల్ లేదా మెకానికల్ డిప్లొమా లేదా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ కలిగి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.

సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 3 లేదా 6 నెలల కంప్యూటర్ సర్టిఫికేట్‌తో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొంది ఉండాలి.

సీనియర్ అసిస్టెంట్ (Official Language): ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లేదా ఆంగ్లంలో గ్రాడ్యుయేట్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP-TS Postal GDS Results: పోస్టల్ జీడీఎస్ ఫలితాలు.. ఐదో లిస్ట్ ను ప్రకటించిన అధికారులు..

వయోపరిమితి:

కనిష్ట వయో పరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయో పరిమితి: 30 సంవత్సరాలు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 1

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30

దరఖాస్తు రుసుము:

UR/OBC/EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ. 1000/-

SC/ ST/ మహిళలు/ ఎక్స్-సర్వీస్‌మెన్/ PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: NIL

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: aai.aero

నోటిఫికేషన్ పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

First published:

Tags: Aai, Airport jobs, Career and Courses, Central Government Jobs, Central jobs, JOBS

ఉత్తమ కథలు