హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AAI Recruitment 2021: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు... విద్యార్హతల వివరాలివే

AAI Recruitment 2021: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు... విద్యార్హతల వివరాలివే

AAI Recruitment 2021: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు... విద్యార్హతల వివరాలివే

AAI Recruitment 2021: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు... విద్యార్హతల వివరాలివే

AAI Recruitment 2021 | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) టెక్నీషియన్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

    ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెస్టర్న్ రీజియన్‌లోని రీజనల్ హెడ్‌క్వార్టర్స్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 90 అప్రెంటీస్ పోస్టుల్ని (Apprentice Jobs) ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా లాంటి ప్రాంతాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 30 చివరి తేదీ. ఇవి ఒక ఏడాది వ్యవధి ఉన్న అప్రెంటీస్ పోస్టులు మాత్రమే.

    టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు అప్రెంటీస్‌షిప్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్ https://portal.mhrdnats.gov.in/ లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, విద్యార్హతలు గురించి తెలుసుకోండి.

    Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే

    AAI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


     మొత్తం ఖాళీలు 90విద్యార్హతలు
     గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇన్ మెకానిక్ లేదా ఆటో ఇంజనీరింగ్ 11 డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ఇన్ మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్
     గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 5 డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్
     గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇన్ కమ్యూనికేషన్ నావిగేషనల్ సర్వైలెన్స్ 6 డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్
     గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్స్ సైన్స్ 3 డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీ
     డిప్లొమా అప్రెంటీస్ ఇన్ ఇన్ మెకానిక్ లేదా ఆటో ఇంజనీరింగ్ 7 డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్
     డిప్లొమా అప్రెంటీస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 18 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
     డిప్లొమా అప్రెంటీస్ ఇన్ కమ్యూనికేషన్ నావిగేషనల్ సర్వైలెన్స్ 18 డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్
     డిప్లొమా అప్రెంటీస్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్స్ సైన్స్ 5 డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీ
     ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ఇన్ మోటార్ వెహికిల్ మెకానిక్ 13 మెకానిక్ మోటార్ వెహికిల్ కోర్సులో సర్టిఫికేట్ ఇన్ వొకేషనల్ కోర్స్
     ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ఇన్ డీజిల్ మెకానిక్ 14 మెకానిక్ డీజిల్ కోర్సులో సర్టిఫికేట్ ఇన్ వొకేషనల్ కోర్స్


    IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1968 పోస్టులు... ఇలా అప్లై చేయండి

    AAI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 1

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 30

    విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ ట్రేడ్ పాస్ కావాలి.

    స్టైపెండ్- రూ.9,000 నుంచి రూ.15,000 వరకు

    టెక్నీషియన్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Airport, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు