హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AAI Recruitment 2020: ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 జాబ్స్... రూ.1,00,000 పైగా జీతం

AAI Recruitment 2020: ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 జాబ్స్... రూ.1,00,000 పైగా జీతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AAI Recruitment 2020 | ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. మరో 300 పోస్టుల భర్తీకి వేరుగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 డిసెంబర్ 15న ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు http://www.aai.aero/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి 2021 జనవరి 14 చివరి తేదీ. మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ లాంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అభ్యర్థులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI అధికారిక వెబ్‌సైట్‌ http://www.aai.aero/ లో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.

  AAI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 368

  మేనేజర్ (ఫైర్ సర్వీసెస్)- 11

  మేనేజర్ (టెక్నికల్)- 02

  జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)- 264

  జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్)- 83

  జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (టెక్నికల్)- 8

  NBCC Recruitment 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 100 జాబ్స్... బీటెక్ పాసైతే చాలు

  Railway Jobs 2021: రైల్వేలో 1004 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  AAI Recruitment 2020: విద్యార్హతల వివరాలు ఇవే...


  మేనేజర్ (ఫైర్ సర్వీసెస్)- ఫైర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్.

  మేనేజర్ (టెక్నికల్)- మెకానికల్ లేదా ఆటోమొబైల్‌లో బీఈ లేదా బీటెక్.

  జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)- ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో మూడేళ్ల బీఎస్సీ లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ. ఏదైనా ఓ సెమిస్టర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్ట్స్ తప్పనిసరి.

  జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్)- సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు రెండేళ్ల ఎంబీఏ. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ.

  జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (టెక్నికల్)- మెకానికల్ లేదా ఆటోమొబైల్‌లో బీఈ లేదా బీటెక్.

  DRDO Recruitment 2020: రూ.54,000 వేతనంతో హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... ఖాళీల వివరాలివే

  NIRD & PR Recruitment 2020: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు

  AAI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 15

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 14

  వేతనం- మేనేజర్‌కు ఏడాదికి రూ.18 లక్షలు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్‌కు ఏడాదికి రూ.12 లక్షలు

  వయస్సు- 2020 నవంబర్ 30 నాటికి మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు. జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు 27 ఏళ్లు.

  దరఖాస్తు ఫీజు- రూ.1000. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు రూ.170 మాత్రమే.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Airport, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

  ఉత్తమ కథలు