RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

RRB Aadhaar Rule | పరీక్షల సమయంలో అభ్యర్థుల్ని గుర్తించడం, మోసాలను అరికట్టడం కోసం ఆధార్ తప్పనిసరి చేసింది ఆర్‌ఆర్‌బీ. అంతేకాదు అభ్యర్థుల ధృవీకరణ కూడా సులువుగా సాగుతుందని భావిస్తోంది.

news18-telugu
Updated: April 25, 2019, 12:17 PM IST
RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ
RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ
  • Share this:
రైల్వే ఉద్యోగం... నిరుద్యోగుల కల. రైల్వేలో నియామకాల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. నిరుద్యోగులు పోటాపోటీగా రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ ఉంటారు. గతేడాది ఆర్ఆర్‌బీ లక్షకు పైగా పోస్టుల్ని భర్తీ చేసిందని అంచనా. ఈసారి అంతకంటే ఎక్కువ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పటికే ఎన్‌టీపీసీ, లెవెల్ 1 లాంటి ఉద్యోగాలకు దరఖాస్తుల్ని స్వీకరించింది. కొద్ది రోజుల క్రితమే ఈస్ట్ కోస్ట్ రైల్వే క్లర్క్, గూడ్స్ గార్డ్, జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఆర్ఆర్‌బీకి సంబంధించిన ఏ పరీక్షకు దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. తమ బోర్డ్ నిర్వహించే పరీక్షలన్నింటికీ ఆధార్ వెరిఫై చేయాలని ఆర్ఆర్‌బీ నిర్ణయించింది. ఈ మేరకు గతంలోనే నోటీస్ జారీ చేసింది. నోటీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

పరీక్షల సమయంలో అభ్యర్థుల్ని గుర్తించడం, మోసాలను అరికట్టడం కోసం ఆధార్ తప్పనిసరి చేసింది ఆర్‌ఆర్‌బీ. అంతేకాదు అభ్యర్థుల ధృవీకరణ కూడా సులువుగా సాగుతుందని భావిస్తోంది. వాస్తవానికి 2016 సెప్టెంబర్ 14న అఫీషియల్ గెజిట్ విడుదల చేసింది. అయితే ఇప్పటికీ అభ్యర్థుల్లో ఆధార్ నిబంధన గురించి సరిగ్గా తెలియక చివరి నిమిషంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే 12 అంకెల ఆధార్ నెంబర్‌ను అప్లికేషన్ ఫామ్‌లో తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆధార్‌ లేకపోతే, ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసినప్పుడు ఇచ్చే 28 అంకెల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Read this: RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఆర్ఆర్‌బీ

అభ్యర్థుల ఆధార్ వివరాలు దరఖాస్తు సమయంలో నమోదు చేయడం ద్వారా, పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్‌లో వేలిముద్రల్ని మ్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించాలనుకుంటే, ఆధార్ కార్డు లేకపోతే మాత్రం వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేయాలి. జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, అస్సాం రాష్ట్రాలకు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3
ఇవి కూడా చదవండి:

Jio Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ జియో యాప్స్ ఉన్నాయా? ఉపయోగాలు తెలుసుకోండి

SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే జాగ్రత్త

SBI New Rules: మే 1 నుంచి ఎస్‌బీఐలో మారనున్న రూల్స్ ఇవే...
First published: April 25, 2019, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading