• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • A US COMPANY IS PAYING RS 30K TO WORKERS IN INDIA DETAILS HERE SU

Job: వీడియో చూడటమే పని.. నెలకు రూ. 30 వేల జీతం.. పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని ఉద్యోగాలు, వారికిచ్చే జీతాల గురించి తెలుసుకున్నప్పుడు కొంత ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఓ జాబ్ గురించే మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు.

  • Share this:
    ప్రపంచంలో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలు, వారికిచ్చే జీతాల గురించి తెలుసుకున్నప్పుడు కొంత ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఓ జాబ్ గురించే మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ భారతదేశంలో ఈ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంతకు ఆ పని ఏమిటని అనుకుంటున్నారా.. సీసీటీవీ వీడియో చూస్తూ ఉండటమే. వివరాలు.. వాషింగ్టన్‌కు చెందిన లైవ్‌ ఐ సర్వైవలెన్స్‌(Live Eye Surveillance) అనే సీసీటీవీ కంపెనీ ఒక ప్రకటన చేసింది. తమ సంస్థ ఆధీనంలోని సీసీటీవీలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఆయా స్టోర్స్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో.. ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా లేదా వింతగా ప్రవర్తిస్తే యజమానులను అప్రమత్తం చేయడం వీరి పని.

    విదేశాల్లోని తమ కంపెనీకి చెందిన సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్న సంస్థలను గమనిస్తూ.. అక్కడ జరిగే వాటిని చూస్తుండాలి. ఆయా సంస్థల్లో ఉద్యోగులు ఏం చేస్తున్నారనే దానిని పర్యవేక్షించాలి. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను గుర్తించి వెంటనే హెచ్చరికలు జారీచేయాలి. ఈ మేరకు లైవ్ ఐ సర్వైవలెన్స్ కంపెనీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. హర్యానాలో ఈ పోస్టుకు ఖాళీ ఉందని పేర్కొంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు స్టోర్స్‌కు వర్చువల్ సూపర్‌వైజర్‌గా వ్యహరిస్తారని తెలిపింది. ఉద్యోగుల భద్రతకు భరోసా ఇవ్వడం, వారికి కేటాయించిన పనులు పూర్తి చేయమని చెప్పడం చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

    కాగా దీనికి ఇంటర్మీడియట్‌, ఆ పైన విద్యార్హత కలిగి ఉండి, కమ్యునికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నవాళ్లు అర్హులు. నెలకు జీతం రూ.30 వేల వరకు ఇస్తారు. ప్రముఖ కంపెనీలు 7-Eleven, Shell, Dairy Queen, Holiday Inn తమ కస్టమర్స్ అని లైవ్ ఐ సర్వైవలెన్స్ పేర్కొంది. ఇక, ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. https://www.myliveeye.com/careers.html‌
    Published by:Sumanth Kanukula
    First published: