హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarships: పీహెచ్ డీ విద్యార్థులకు షాక్.. ఈ ఏడాది నుంచి ఆ పరీక్షల నిపుదల.. అభ్యర్థుల్లో టెన్షన్ .. ఎందుకంటే ?

Scholarships: పీహెచ్ డీ విద్యార్థులకు షాక్.. ఈ ఏడాది నుంచి ఆ పరీక్షల నిపుదల.. అభ్యర్థుల్లో టెన్షన్ .. ఎందుకంటే ?

 పీహెచ్ డీ విద్యార్థులకు షాక్.. ఈ ఏడాది నుంచి కేవీపీవై పరీక్షల నిపుదల..  ఆభ్యర్థుల్లో టెన్షన్ .. ఎందుకంటే ?

పీహెచ్ డీ విద్యార్థులకు షాక్.. ఈ ఏడాది నుంచి కేవీపీవై పరీక్షల నిపుదల.. ఆభ్యర్థుల్లో టెన్షన్ .. ఎందుకంటే ?

ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్‌స్సైర్ రీసెర్చ్ - స్కాలర్‌షిప్(Scholarship) ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (INSPIRE-SHE)లో కేవీపీవైని విలీనం చేసినట్లు తెలిపింది. దీంతో రీసెర్చర్స్, అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఏం జరిగిందో చదవండి ఇక్కడ..

ఇంకా చదవండి ...

కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(KVPY) అనేది పరిశోధన కెరీర్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన జాతీయ-స్థాయి ఫెలోషిప్ ప్రోగ్రామ్. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి కేవీపీవై(KVPY) పరీక్షలను నిలిపివేస్తున్నట్లు డీఎస్‌టీ (DST) ఇటీవల ప్రకటించింది. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్‌స్సైర్ రీసెర్చ్ - స్కాలర్‌షిప్(Scholarship) ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (INSPIRE-SHE)లో కేవీపీవైని విలీనం చేసినట్లు తెలిపింది. దీంతో రీసెర్చర్స్, అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో డీఎస్‌టీ, ఈ కొత్త నిర్ణయం అభ్యర్థులకు ఎలా ఉపయోగపడుతుందన్న విషయంపై వరుస ట్వీట్‌లతో వివరించే ప్రయత్నం చేసింది.

KVPY ప్రోగ్రామ్ కమిటీ, కేవీపీవై పరీక్ష(Exams)ను నిర్వహించడం ద్వారా సంవత్సరానికి కేవలం 300 మంది విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్న విషయాన్ని గుర్తించినట్లు డీఎస్‌టీ తెలిపింది. మరోపక్క ‘ఇన్ స్పైర్’ పోటీ ప్రాతిపదికన ప్రతిభావంతులైన విద్యార్థులకు సంవత్సరానికి సుమారు 12,000 స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్‌లు అందిస్తోందని డీఎస్‌టీ వెల్లడించింది.

విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు, విద్యార్థుల ఆసక్తి, పరీక్షల నిర్వహణ ఖర్చును దృష్టిలో ఉంచుకుని కేవీపీవై‌ని ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో విలీనం చేశామని డీఎస్‌టీ చెప్పుకొచ్చింది. తద్వారా టాలెంట్ ఉన్న మరింత మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి: Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !“కేవీపీవైని రద్దు చేయలేదు. ఇన్‌స్పైర్ (INSPIRE)కు చెందిన స్కాలర్‌షిప్‌ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ (SHE) కాంపోనెంట్ దీన్ని కింద చేర్చాం. KVPY పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బేసిక్ అండ్ నేచురల్ సైన్స్ సబ్జెక్టులను అభ్యసిస్తే ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షల ద్వారా కూడా స్కాలర్‌షిప్‌లను పొందుతారు.’’ అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) వివరించింది.

మరోపక్క ఇన్‌స్సైర్ రీసెర్చ్ ఫ్యాకల్టీ ఫెలోషిప్ కోసం పీహెచ్‌డీ (PhD)స్కాలర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST). అర్హత ఉన్న అభ్యర్థులు INSPIRE వెబ్ పోర్టల్ అధికారిక సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 15గా నిర్ణయించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా పీహెచ్‌డీ చేసిన యువకులకు పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్‌లను అందించనున్నారు.

ఇది ఐదేళ్ల పాటు కొనసాగనుంది. బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్ విభాగాల్లోని మెడిసిన్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్సెస్‌‌లో ఎంపికైన అభ్యర్థులు పోస్ట్-డాక్టోరల్ పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్సైర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఎంపికైన అభ్యర్థులకు రూ. 2,000 వార్షిక ఇంక్రిమెంట్‌తో నెలకు రూ.1,25,000 ఇవ్వనున్నారు. అదనంగా, ఐదేళ్లపాటు ప్రతి సంవత్సరం రూ.7 లక్షల రీసెర్చ్ గ్రాంట్ కూడా లభిస్తుంది.

Published by:Mahesh
First published:

Tags: Exams, JOBS, Scholarships, University Grants Commission

ఉత్తమ కథలు