హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC 5 Notifications: TSPSC నుంచి 5 నోటిఫికేషన్లు.. అర్హత, చివరి తేదీ, పోస్టుల వివరాలిలా..

TSPSC 5 Notifications: TSPSC నుంచి 5 నోటిఫికేషన్లు.. అర్హత, చివరి తేదీ, పోస్టుల వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం (image: TSPSC)

ప్రతీకాత్మక చిత్రం (image: TSPSC)

TSPSC 5 Notifications: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. వరుసగా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వస్తున్నాయి. అదే విధంగా టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి కూడా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇలా ఇటీవల దాదాపు 5 నోటిఫికేషన్లను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర మొదలైంది. వరుసగా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ(Finance Ministry) నుంచి అనుమతులు వస్తున్నాయి. అదే విధంగా టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి కూడా నోటిఫికేషన్లు(Notifications) విడుదల అవుతున్నాయి. ఇలా ఇటీవల దాదాపు 5 నోటిఫికేషన్లను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. దీనికి సంబంధించి అర్హతలు, దరఖాస్తులకు చివరి తేదీలాంటి వివరాలను తెలుసుకుందాం ..

1. ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు..

టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి ఇటీవల మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు మాత్రమే అర్హత ఉంది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 10న దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ 1 లో మొత్తం 17 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్ 2 లో మొత్తం 06 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 చెల్లించనున్నారు.

అర్హతలు ఇలా..

హోం సైన్స్ లేదా సోషల్ సైన్స్, లేదా ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా.. బోటనీ, బయాలజీ, బయో కెమిస్ట్రీ తో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2. ములుగు ఫారెస్ట్ కాలేజీలో టీచింగ్ పోస్టులు..

ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 22, 2022న దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్(Notification) వెలువడింది. అయితే దరఖాస్తుల ప్రక్రియ మాత్రం సెప్టెంబర్ 6, 2022 నుంచి మొదలైంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 27, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ప్రొఫెసర్ పోస్టులకు వైల్డ్ లైఫ్ సైన్సెస్/ వైల్డ్ లైఫ్ బయాలజీ/ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్/ఫారెస్ట్రీ వంటి విభాగంలో ఉత్తీర్ణత సాధించాలి. పీహెచ్‌డీ అభ్యర్థులు అయితే.. వైల్డ్ లైఫ్ సైన్సెస్/ వైల్డ్ లైఫ్ బయాలజీ/ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్/ఫారెస్ట్రీ వంటి విభాగాల్లో చేసి ఉండాలి. పని అనుభం 10 ఏళ్ల వరకు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అసోసియేట్ ప్రొఫెసర్స్ 55 శాతం మార్కులతో ఎంఎస్సీ అగ్రికల్చర్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ ఫారెస్ట్రీ/సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ ఫారెస్ట్ బయాలజీ అండ్ ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్స్/ ఫారెస్ట్ బయోటెక్నాలజీ/ ట్రీ బ్రీడింగ్ & ఇంప్రూవ్‌మెంట్/ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్ వంటి సబ్జెక్టులో పీజీ ఉండాలి.

AP-TS Postal GDS Results: పోస్టల్ జీడీఎస్ ఫలితాలు.. ఐదో లిస్ట్ ను ప్రకటించిన అధికారులు..

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. అది కూడా.. జియో-ఇన్‌ఫర్మేషన్ సైన్స్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్/జియో స్పేషియల్ టెక్నాలజీ/ఫారెస్ట్రీ/సిల్వీకల్చర్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ/ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్/ ఫారెస్ట్ బయాలజీ & ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ప్లాంట్ బయోటెక్నాలజీ/ఫారెస్ట్ మేనేజ్‌మెంట్/వైల్డ్ ‌లైఫ్ మేనేజ్‌మెంట్/ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్/ బోటనీ తదితర సబ్జెక్టుల్లో పీజీ ఉండాలి. ఈ పోస్టులకు ఎంలాటి పని అనుభవం అవసరం లేదు.

3. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులు

ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 181 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

New Recruitment Board In Telangana: 15 వర్సిటీల సిబ్బంది నియామకాలకు కొత్త బోర్డు.. ఆ 3,500 పోస్టులు కూడా ఈ బోర్డు ద్వారానే..

అర్హతల విషయానికి వస్తే.. బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అది కూడా.. సంబంధిత సబ్జెక్టులో పూర్తి చేసి ఉండాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

4. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాలు ..

మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి డిప్లొమా(D.C.E./L.C.E./L.A.A.) ఉండాలి. (లేదా) డిగ్రీ (బీఆర్క్) లేదా బీఈ/బీటెక్ (సివిల్)/ బీప్లానింగ్/బీటెక్ (ప్లానింగ్) ఉత్తీర్ణత ఉండాలి.

DRDO Jobs 2022: DRDOలో అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు.. కొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ.. 

5. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 1540 పోస్టుల భర్తీకి సంబంధించి ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్ 14, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరిస్తారు.

వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హతలు..

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మిషన్ భగీరథ), పీఆర్ అండ్ ఆర్ డీ విభాగంలోని ఏఈఈ పోస్టులు, ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో పోస్టులకు , టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్, టీఆర్ అండ్ బీ విభాగంలోని పోస్టులకు సివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఐ అండ్ సీఏడీ విభాగంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఐఅండ్ సీఏడీ విభాగంలో( మెకానికల్) ఏఈఈ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలోని పోస్టులకు ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

అన్ని నోటిఫికేషన్స్ కు అధికారికి వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు.

First published:

Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Telangana jobs, TSPSC

ఉత్తమ కథలు