హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

MLHP Posts In Telangana: 32 జిల్లాల వ్యాప్తంగా మిడ్‌ లెవెల్‌ పోస్టుల భర్తీ.. ఏ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులున్నాయంటే..

MLHP Posts In Telangana: 32 జిల్లాల వ్యాప్తంగా మిడ్‌ లెవెల్‌ పోస్టుల భర్తీ.. ఏ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులున్నాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అనారోగ్యం వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్తుంటాం. అక్కడ నాడి పట్టే వైద్యుడు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం వైద్యుల పోస్టులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అనారోగ్యం వచ్చినప్పుడు ఆసుపత్రికి(Hospital) వెళ్తుంటాం. అక్కడ నాడి పట్టే వైద్యుడు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం వైద్యుల పోస్టులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇచ్చింది. తెలంగాణలో బస్తీ, పల్లె దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా హెల్త్‌ సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానలుగా ప్రభుత్వం మార్చింది. పైసా ఖర్చు లేకుండా సొంతూర్లలోనే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. వీటిలో అవసరమైన సిబ్బంది, వైద్యులు లేకపోవడంతో రోగులకు ఎంతో ఇబ్బంది గా మారింది. ఇక నుంచి ఆ సమస్య ఉండకూడదని.. మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (Mid Level Health Providers) పోస్టుల నియామకాలకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 956 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది.

Telangana District Posts: తెలంగాణలోని ఈ జిల్లాల్లో MLHP పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..

ఈ మేరకు అర్హత మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ‘మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ)’ పేరిట 32 జిల్లాల వ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. వీటిని ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు. 956 పోస్టులతో కలుపుకొని.. మొత్తం అర్బన్ ఏరియాల్లో 349, రూరల్ ఏరియాల్లో 1220 మొత్తం 1569 పోస్టులను భర్తీ చేయనున్నారు. పట్టణాలు, పల్లెల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలను బస్తీ, పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దనుండడంతో వాటిలో ఎంఎల్‌హెచ్‌పీల సేవలు అవసరమయ్యాయి. దీంతో 33 జిల్లాల వ్యాప్తంగా డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు.

అర్హతల విషయానికి వస్తే..

పల్లె దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్, బీఏఎంఎస్‌తోపాటు స్టాఫ్‌ నర్సులు అర్హులని పేర్కొంది. ఒక వేళ ఎంబీబీఎస్, బీఏఎంఎస్‌ అందుబాటులో లేకపోతే.. బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులకు అవకాశం ఇవ్వనున్నారు. వీరు 2020 తర్వాత ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్‌ ప్రొగ్రామ్‌ను పూర్తిచేసిన వారిని పరిగణనలోకి తీసుకోనున్నారు. వైద్యులకు నెలకు రూ. 40 వేలు, స్టాఫ్ నర్సు పోస్టులకు నెలకు రూ.29,900 గౌరవ వేతనం అందిస్తారు. వీటిని కాంట్రాక్ట్ బేసిసిలో తీసుకుంటారు. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 5ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Career Tips: మీరు కాలేజీ స్టూడెంట్స్ అయితే.. ఈ అలవాట్లను మానుకోండి.. లేదంటే..

దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 17, 2022గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తులను ఆయా జిల్లాల డీఎంహెచ్ఓ వెబ్ సైట్ కు వెళ్లి.. దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలో పేర్కొన్న విధంగా వివరాలను నమోదు చేసి.. పోస్టు ద్వారా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, మీరు ఏ జిల్లాకు దరఖాస్తు చేస్తున్నారో ఆ జిల్లా పేరు, తెలంగాణ అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అక్టోబర్ 03, 2022గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

అర్భన్ ఏరియాల్లో పోస్టులు మొత్తం 349..

జిల్లాపోస్టుల సంఖ్య
ఆదిలాబాద్2
అసిఫాబాద్3
భద్రాద్రి కొత్తగూడెం13
జగిత్యాల16
జనగాం0
జయశంకర్ భూపాలపల్లి3
జోగులాంద గద్వాల5
కామారెడ్డి11
కరీంనగర్13
ఖమ్మం11
మహబూబాబాద్8
మహబూబ్ నగర్10
మంచిర్యాల18
మెదక్11
మేడ్చల్17
ములుగు0
నాగర్ కర్నూలు8
నల్గొండ18
నారాయణపేట8
నిర్మల్5
నిజామాబాద్11
పెద్దపల్లి9
రాజన్న సిరిసిల్ల6
రంగారెడ్డి39
సంగారెడ్డి26
సిద్దిపేట11
సూర్యాపేట15
వికారాబాద్14
వనపర్తి10
వరంగల్5
హన్మకొండ8
యాదాద్రి భువనగిరి15

రూరల్ ఏరియాల్లో పోస్టుల మొత్తం 1220.. 

జిల్లాపోస్టుల సంఖ్య
ఆదిలాబాద్51
అసిఫాబాద్53
భద్రాద్రి కొత్తగూడెం90
జగిత్యాల35
జనగాం32
జయశంకర్ భూపాలపల్లి24
జోగులాంద గద్వాల21
కామారెడ్డి70
కరీంనగర్01
ఖమ్మం27
మహబూబాబాద్42
మహబూబ్ నగర్0
మంచిర్యాల19
మెదక్57
మేడ్చల్10
ములుగు33
నాగర్ కర్నూలు33
నల్గొండ78
నారాయణపేట29
నిర్మల్37
నిజామాబాద్94
పెద్దపల్లి20
రాజన్న సిరిసిల్ల21
రంగారెడ్డి55
సంగారెడ్డి76
సిద్దిపేట71
సూర్యాపేట29
వికారాబాద్48
వనపర్తి19
వరంగల్25
హన్మకొండ0
యాదాద్రి భువనగిరి20

పూర్తి నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

First published:

Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Telangana government jobs