విద్యాశాఖలో ఉద్యోగం పొందాలనుకునే వారికి గుడ్ న్యూస్. దీని కోసం సమగ్ర శిక్షా లడఖ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో(Residential Hostels) వివిధ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 22 సెప్టెంబర్ 2022. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత గల అభ్యర్థులు సమగ్ర శిక్షా లడఖ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రకారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ టైప్ 1, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ టైప్ IV మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ రెగ్యులర్ టీచర్, వార్డెన్, అకౌంటెంట్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్(Assistant Cook), సపోర్ట్ స్టాఫ్, చౌకీదార్ అండ్ స్వీపర్ కమ్ అప్లికేషన్స్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 194 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు https://leh.nic.in/notice_category/recruitment/ వెబ్ సైట్ ను సందర్శించాలి.
ఖాళీ పోస్టుల వివరాలు..
వార్డెన్ – 26
రెగ్యులర్ టీచర్ – 20
అకౌంటెంట్ – 22
హెడ్ కుక్ – 23
అసిస్టెంట్ కుక్ – 46
సపోర్టింగ్ స్టాఫ్ – 38
చౌకీదార్ – 04
స్వీపర్ – స్కావెంజర్ – 15
విద్యార్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వేర్వేరు విద్యార్హతలను కలిగి ఉండాలి. వార్డెన్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఫుల్ టైం ఉపాధ్యాయ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ (B.Ed అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది) ఉండాలి. అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు స్టాటిస్టిక్స్/ఎకనామిక్/అకౌంట్స్ సబ్జెక్ట్‌లలో ఒక సబ్జెక్ట్ ఉండే విధంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
S.No | పోస్టు పేరు | విద్యార్హతలు |
1 | వార్డెన్ | డిగ్రీ |
2 | టీచర్ | డిగ్రీ, బీఈడీ |
3 | అకౌంటెంట్ | స్టాటిస్టిక్స్ / ఎకనామిక్స్ / అకౌంటెన్సీలో గ్రాడ్యుయేట్ |
4 | హెడ్ కుక్ | 12వ తరగతి |
5 | అసిస్టెంట్ కుక్ | 12వ తరగతి |
6 | సహాయక సిబ్బంది | స్టాటిస్టిక్స్ / ఎకనామిక్స్ / అకౌంటెన్సీలో గ్రాడ్యుయేట్ |
7 | చౌకీదార్ | 10వ తరగతి |
8 | స్వీపర్ కమ్ స్కావెంజర్ | 12వ తరగతి |
వయోపరిమితి
వార్డెన్, టీచర్ అండ్ అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు ఉండాలి. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అసిస్టెంట్ స్టాఫ్, వాచ్‌మెన్ అండ్ స్వీపర్ స్కావెంజర్‌లకు కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరం ఉండాలి.
జీతం వివరాలు
వార్డెన్, రెగ్యులర్ టీచర్, అకౌంటెంట్‌లకు రూ.20 వేలు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, సపోర్టు స్టాఫ్, వాచ్‌మెన్, స్వీపర్ స్కావెంజర్‌లకు రూ.10 వేలు జీతంగా చెల్లిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, Govt Jobs 2022, JOBS