హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CTET 2022 Update: CTET కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అలర్ట్.. కీలక ప్రకటన విడుదల..

CTET 2022 Update: CTET కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అలర్ట్.. కీలక ప్రకటన విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CTET 2022 కోసం రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులతో పాటు.. దేశ వ్యాప్తంగా టీచర్ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ముందుగా జులై మొదటి వారంలోగా వెలువడుతుందని భావించారు.

CTET 2022 కోసం రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులతో పాటు.. దేశ వ్యాప్తంగా టీచర్ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్(Notification) ముందుగా జులై(July) మొదటి వారంలోగా వెలువడుతుందని భావించారు. అయితే.. ప్రస్తుత అప్‌డేట్ ప్రకారం.. CTET నోటిఫికేషన్ ఆగస్టులో(August) విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  CBSE CTET డిసెంబర్ 2022 పరీక్షకు సంబంధించి సంక్షిప్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 2022లో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)ని CBT విధానంలో నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. CTETడిసెంబర్ 2022 వివరణాత్మక నోటిఫికేషన్ ను త్వరలో ctet.nic.inలో విడుదల చేస్తామని పేర్కొంది. ఇది 20 భాషల్లో నిర్వహించబడుతుందని నోటిఫికేషన్లో పేర్కొంది.

PG Qualification Jobs: మాస్టర్ డిగ్రీ అర్హతతో.. ఇంటర్వ్యూ ద్వారా పలు ఉద్యోగాల భర్తీ..


CTET పరీక్ష విధానం, భాష, సిలబస్, అర్హత, పరీక్ష నగరం మరియు ముఖ్యమైన తేదీల వివరాలు త్వరలో విడుదల కాబోయే నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు ctet.nic.in వెబ్‌సైట్ నుండి CTET బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. దానిని జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఈ పరీక్ష గురించి వచ్చే పుకార్లను నమ్మవద్దని.. సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించాలన్నారు.

దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) CTET పరీక్షకు సంబంధించి కచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. అయినా.. పరీక్షను డిసెంబర్ 2022లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. వాస్తవానికి పరీక్షకు 3 నెలల ముందు నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలైలో ప్రారంభమైతే నవంబర్ లో పరీక్ష నిర్వహించాలి. కానీ వాళ్లు విడుదల చేసిన నోటీస్ డిసెంబర్‌లో పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో CTET నోటిఫికేషన్ 2022 జూలై చివరి నాటికి లేదా ఆగస్ట్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ESIC Recruitment 2022: హైదరాబాద్ ESICలో ఉద్యోగాలు.. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. 


CTET డిసెంబర్ 2022 కోసం దరఖాస్తు ప్రక్రియ తేదీలను నిర్ణీత సమయంలో తెలియజేస్తామని CBSE తెలిపింది. ప్రతీ సంవత్సరం రెండు సార్లు ఈ సీటెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 2022 సంవత్సరంలో ఇంత వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. సీటెట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ మరియు OBC కేటగిరీ అభ్యర్థులు పేపర్ 1 లేదా పేపర్ 2 కు రూ. 1000 , ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే.. జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.

CBSE ప్రతి సంవత్సరం CTET పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తుంది.మొదటి పరీక్ష జూలై నెలలో, రెండవ పరీక్ష డిసెంబర్‌లో నిర్వహిస్తారు.CTET పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉపాధ్యాయుల నియామకానికి అర్హులుగా పరిగణించబడతారు.పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణించబడతారు.

అంతకుముందు CTET డిసెంబర్ 2021 పరీక్షలో, CTET పేపర్-1 మరియు పేపర్-2 రెండింటిలోనూ మొత్తం 27,73,676 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 6,65,536 మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. CTET గుర్తింపు ఇప్పుడు ఏడేళ్లకు బదులు జీవితకాలం చేయబడింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ మరియు ఆర్మీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల నియామకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. CTET లో అర్హత సాధించాలంటే.. ఏ అభ్యర్థి అయినా కనీస మార్కులను సాధించాలి.

EAMCET Chemistry Preparation Tips: ఈ టిప్స్ పాంటిస్తే.. ఎంసెట్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ సాధించొచ్చు..


జనరల్ కేటగిరీ విద్యార్థులు పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి.అదే సమయంలో, ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు, ఈ కనీస స్కోరు 55 శాతంగా ఉంటుంది. అంటే.. పరీక్ష 150 మార్కులకు ఉంటే.. అందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా 90 మార్కులు సాధించాలి. అలాగే.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 82.5 మార్కులు సాధించాలి.

Published by:Veera Babu
First published:

Tags: AP TET 2022, Career and Courses, Ctet, JOBS, Students, TS TET 2022

ఉత్తమ కథలు