ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు (Transgender Students) సాధారణ పాఠశాలల్లో ఏ ఇబ్బందులూ లేకుండా కలిసి చదువుకోవడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది. దాని ప్రకారం జండర్ ప్రస్థావన లేకుండా ఉండే న్యూట్రల్ యూనిఫాంలు, సేఫ్ వాష్‌రూంలను తీసుకురానున్నారు. ఇంకా వారికి సంబంధించిన అనేక జాగ్రత్తలతో కూడిన ఓ మాన్యువల్ తయారు చేశారు.
వీటికి సంబంధించిన మాన్యువల్‌ను NCERT తాజాగా విడుదల చేసింది. సంస్థ జండర్ స్టడీస్ హెడ్ జ్యోత్స్న తివారీ, ‘ఇంటిగ్రేటింగ్ ట్రాన్స్‌జెండర్ కన్సర్న్స్ ఇన్ స్కూలింగ్ ప్రోగ్రెస్’ పేరుతో మాన్స్యువల్ డ్రాఫ్డ్‌ను విడుదల చేశారు. 16 మంది సభ్యుల కమిటీ దీన్ని రూపొందించింది.
* న్యూట్రల్ యూనిఫాంలు
ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా న్యూట్రల్‌గా ఉండే దుస్తుల్ని(Neutral Uniforms) వారికి డిజైన్ చేస్తారు. ముఖ్యంగా ఆరో తరగతి పైబడిన విద్యార్థులు నిర్దిష్ట లింగానికి సరిపోయే యూనిఫాం వేసుకోవాలంటే వారికి కంఫర్ట్‌గా ఉండదు. దీంతో వారికి అన్ని వాతావరణ పరిస్థితులకు సరిపోయేలా, జండర్ న్యూట్రల్‌గా ఉండే యూనిఫాంలను డిజైన్ ఇన్‌స్టిట్యూట్లతో డిజైన్ చేయిస్తారు. ఆడ, మగ ఏ లింగం వారికైనా సరిపోయేలాంటి ప్యాంట్లు, షర్ట్స్‌ను చాలా స్కూళ్లు పరిచయం చేశాయి. వీటి వల్ల జండర్ న్యూట్రల్ స్టూడెంట్స్‌ను స్కూళ్లకు తీసుకురావడం సాథ్యం అవుతుంది. ఎక్స్‌ట్రా కరికులం యాక్టివిటీస్, క్రీడలు, వాష్‌రూంలను యూజ్ చేయడం లాంటి వాటిలో వారు ఇబ్బందులు పడకుండా ఉంటారు.
* ఉపాధ్యాయులు సున్నితంగా వ్యవహరించాలి
మాన్యువల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సమాజంలోని ట్రాన్స్‌జెండర్ల(Transgenders) లింగ వివక్షత అసహనం కారణంగా చిన్నప్పటి నుంచి అలాంటి వారు హింసకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పాఠశాల స్థాయిలో విద్యార్థి ట్రాన్స్ జెండర్‌గా రూపుదాలుస్తున్నాడని ఉపాధ్యాయులు గుర్తించినట్లయితే వారి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి. అలాంటి వారికి మద్దతుగా ఉండి వారికి సహకరించాలి.
లైంగిక విద్య , ఆరోగ్య విద్యలాంటి పాఠ్యాంశాలను బోధించేప్పుడు జాగ్రత్తగా మూడో లింగాన్ని కూడా కలుపుకునే పద్ధతులను ఉపయోగించాలి. సమాజం వీరిని చూసే తీరు వల్ల వీరి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. భయం, ఆందోళన, ఒత్తిడి, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం, ఒంటరిగా ఉండాలని అనుకోవడం, తనని తాను హింసించుకోవడం, డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయని ఆ మాన్యువల్ సూచించింది.
* టెక్స్ట్ బుక్స్‌లో మార్పులు
పాఠ్య పుస్తకాలల్లో లింగాలు, లింగ మార్పిడి అయిన వారికి అవసరమైన సమాచారం పొందుపరిచేందుకు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూడాలని విద్యావేత్తలకు ఈ కమిటీ సూచించింది. కాంటెక్స్ట్ స్పెసిఫిక్‌గా వాటిని షేర్ చేయాలని తెలిపింది. సమానత్వం, సాధికారతలాంటి వాటిలో ఉన్న సమస్యల్ని పాఠ్యపుస్తకాల్లో ఇతివృత్తాలుగా చేసేందుకు ఉన్న అవకాశాలను చూడాలని ఆ మాన్యువల్‌లో ఉంది. డిబేట్లు, నాటకాలు, వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్‌లు తదితరాల ద్వారా వీటికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించాలని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, Ncert, Transgender