నీట్‌లో 99.90 పర్సంటైల్ మార్కులు(Marks) సాధించి మెడికల్ ఇన్‌స్టిట్యూట్ జిప్మర్‌లో(Medical Institute Jipmer) ప్రవేశం పొందిన కేరళ విద్యార్థిని అడ్మిషన్‌ను మెడికల్ కౌన్సిల్ కమిటీ రద్దు చేసింది. విద్యార్థి పేరు నాజిహ్ సర్ఫరాజ్ ఖలీద్. రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని చెప్పడంతో అతని అడ్మిషన్ రద్దు చేయబడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఖలీద్ నీట్ 2022లో అద్భుత కనబరిచి 99 పర్సంటైల్ సాధించాడు. దీని తరువాత అతను ఏదైనా కళాశాలలో అడ్మిషన్ తీసుకోవచ్చు కానీ అతను మెడికల్ ఇన్స్టిట్యూట్ JIPMER ను ఎంచుకున్నాడు. స్థానిక కోటా కింద ఈ కళాశాలలో ప్రవేశం పొందాడు. ఇదిలా ఉంటే.. తన అడ్మిషన్‌కు వ్యతిరేకంగా, ఇన్‌స్టిట్యూట్‌లోని మరో విద్యార్థి ఎస్. స్వామినాథన్ ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్ అథారిటీకి(Institute Admission Authority) ఫిర్యాదు చేశాడు.
దరఖాస్తు ఫారమ్‌లో తప్పుడు సమాచారం ఇచ్చి ఖలీద్ అడ్మిషన్ తీసుకున్నాడని చెప్పాడు. ఖలీద్ రెసిడెన్సీ కోటా (స్థానిక) ద్వారా JIPMER లో అడ్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. అదే ఏడాది ఖలీద్ పుదుచ్చేరితో పాటు కేరళలో నివాసం ఉంటున్నట్లు తదుపరి విచారణలో తేలింది. ఎస్ సామినాథన్ ఫిర్యాదుపై ఇన్‌స్టిట్యూట్ చర్య తీసుకోకపోవడంతో, ఖలీద్ ప్రవేశాన్ని రద్దు చేయాలని నవంబర్‌లో మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ విషయాన్ని విన్న మద్రాస్ హైకోర్టు పుదుచ్చేరి ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను అతని ప్రవేశంపై "తగిన నిర్ణయం" తీసుకోవాలని కోరింది. అదే సమయంలో.. MCC(Medical Council Committee) తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంది.ఖలీద్ ప్రవేశాన్ని రద్దు చేసింది. మీడియా కథనాల ద్వారా ఈ వార్త వైరల్ కావడంతో.. అతడి స్థానంలో ఎస్. సామినాథన్ కి ప్రవేశం కల్పించారు. నిబంధనల ప్రకారం.. ఒక విద్యార్థి వైద్య కళాశాలలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఒక విద్యా సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో నివాసం క్లెయిమ్ చేయలేరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admissions, Career and Courses, JOBS, NEET, NEET 2022