ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాలంటే కొన్ని అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా టెక్నాలజీ (Technology) రంగంలో కెరీర్ ప్లాన్ (Career Plan) చేసుకునేవారు తప్పనిసరిగా కొన్ని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. అలాంటి వారి కోసం హసన్ టూర్ అనే ట్విట్టర్ యూజర్, హార్వర్డ్ యూనివర్సిటీ ఆన్లైన్లో అందిస్తున్న పది ఫ్రీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కోర్సుల లిస్టును షేర్ చేశారు. వాటికి సంబంధించిన లింకులను కూడా పోస్ట్ చేశారు. ఆ వివరాలు..
* ఇంట్రడక్షన్ టు గేమ్ డెవలప్మెంట్
సూపర్ మారియో బ్రోస్, పోకీమాన్, యాంగ్రీ బర్డ్స్ వంటి విజయవంతమైన గేమ్స్ రూపొందించడానికి, అలాగే 2D, 3D ఇంటరాక్టివ్ గేమ్స్ డెవలప్మెంట్పై పూర్తి అవగాహన పొందడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. వారానికి 6- 9 గంటల సమయం కేటాయిస్తే మూడు నెలలు దీనిపై పట్టు సాధించవచ్చు.
* ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్
కంప్యూటర్ సైన్స్‌పై కనీస అవగాహన లేని వారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. దీనితో ప్రోగ్రామింగ్ స్కిల్స్‌పై పూర్తి అవగాహన పెరుగుతుంది. ప్రోగ్రామింగ్‌లో వచ్చే కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఆల్గారిథమిక్గా ఆలోచించడం వంటివి అలవాటవుతాయి. 11 వారాల వ్యవధిలో ఈ కోర్సు పూర్తవుతుంది.
* ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ విత్ స్క్రాచ్
ఇది మూడు వారాలు పాటు సాగే ఆన్లైన్ కోర్సు. ఈ కోర్సు విద్యార్థికి ప్రోగ్రామింగ్‌లో మెరుగైన అంశాలను పరిచయం చేస్తూ కోడింగ్‌ను విజయవంతంగా చేయడానికి సహకరిస్తుంది, దీనికి సంబంధించిన గైడెన్స్ అందిస్తుంది.
* వెబ్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్
ఈ కోర్సుతో విద్యార్థులకు జంగో, రియాక్ట్, బూట్ స్ట్రాప్ వంటి ఫ్రేమ్‌వర్క్స్ ఉపయోగించుకుని చేసే జావా స్క్రిప్ట్, పైథాన్, SQL వంటి వెబ్ అప్లికేషన్లను సమర్థవంతంగా డిజైన్ చేయడంపై అవగాహన పెరుగుతుంది. అలాగే వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. వారానికి 6 నుంచి 9 గంటలు కేటాయిస్తే 12 వారాలో ఈ కోర్సు నేర్చుకోవచ్చు.
* అండర్స్టాండింగ్ టెక్నాలజీ
డైలీ టెక్నాలజీతో వర్క్ చేసే వారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. కానీ కోడింగ్‌లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది పూర్తిగా తెలుసుకోలేరు. 6 వారాలపాటు ఈ కోర్సు కొనసాగుతుంది.
* ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ పైథాన్
రాబోయే రోజుల్లో టెక్నాలజీ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే పనిచేస్తుంది. ఈ కోర్స్ ద్వారా విద్యార్థులు మెషిన్ లెర్నింగ్‌లో అవగాహన పొందవచ్చు. 7 వారాలపాటు కొనసాగే ఈ ప్రోగ్రామ్‌లో పైథాన్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు.
* ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ విత్ పైథాన్జ్
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పైథాన్ గురించి ఈ కోర్సులో పూర్తిగా నేర్చుకోవచ్చు. పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుని, దాని ద్వారా ఒక కోడ్ రీడ్ చేయడం, రైట్ చేయడం తెలుసుకోవచ్చు. అలాగే ఒక కోడ్ టెస్ట్ చేయడం, డీబగ్గింగ్ చేయడం తెలుస్తుంది.
* కంప్యూటర్ సైన్స్ ఫర్ బిజినెస్ ప్రొఫెషనల్
సాఫ్ట్వేర్ స్టూడెంట్స్, బిజినెస్‌లో రాణించాలనుకున్న ఇతర విద్యార్థులను ప్రొఫెషనల్‌గా మార్చే కోర్సు ఇది. కంప్యుటేషనల్ థింకింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇంటర్నెట్ టెక్నాలజీలను ఈ కోర్సులో ఆరు వారాలలో నేర్చుకోవచ్చు.
* ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ విత్ పైథాన్
ఈ కోర్సుతో పైథాన్ నాలెడ్జ్‌తో డేటాను అనలైజ్ చేయడం, యూజ్ చేయడం తెలుకోవచ్చు .
* మొబైల్ యాప్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ నేటివ్
జావా లేదా స్విఫ్ట్ లేకుండా జావా స్క్రిప్ట్ ఉపయోగించి ప్రారంభించే క్రాస్ ప్లాట్‌ఫామ్ నేటివ్ యాప్స్ అయిన ఫేస్బుక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఉపయోగించే రియాక్ట్ నెటివ్ ఫ్రేమ్ వర్క్ సహాయంతో మొబైల్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Computer science, EDUCATION, JOBS