Home /News /jobs /

A JEE TOPPER WHO CLAIMS TO SCORE WITHOUT ANY PREPARATION WOULD BE SURPRISED TO KNOW HOW TO PREPARE GONE UMG GH

JEE Main: ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే స్కోర్ సాధించానంటున్న జేఈఈ టాపర్.. ఎలా సిద్ధం అయ్యాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే స్కోర్ సాధించానంటున్న జేఈఈ టాపర్

ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే స్కోర్ సాధించానంటున్న జేఈఈ టాపర్

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్‌ సెషన్ 1 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ టెస్ట్‌లో 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. వీరిలో ఉత్తరప్రదేశ్ నుంచి టాప్ స్కోర్ చేసిన ఒకే ఒక అభ్యర్థి సౌమిత్ర గార్గ్.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్‌ సెషన్ 1 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ టెస్ట్‌లో 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. వీరిలో ఉత్తరప్రదేశ్ నుంచి టాప్ స్కోర్(score) చేసిన ఒకే ఒక అభ్యర్థి సౌమిత్ర గార్గ్. IIT ఎంట్రన్స్ ఎగ్జామ్‌ - JEE అడ్వాన్స్‌డ్‌లో టాప్ స్కోర్ తన లక్ష్యం అంటున్నాడు మీరట్‌కు చెందిన ఈ సక్సెస్‌ఫుల్ స్టూడెంట్. ఇప్పటికే KVPY - IISc బెంగళూరు ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన ఈ 19 ఏళ్ల యువకుడు.. తన ప్రిపరేషన్‌ స్ట్రాటజీతో పాటు ఫ్యూచర్ గోల్స్‌ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ వివరాలు..

JEE మెయిన్‌ ఒక ఈజీ టెస్ట్ అంటున్నాడు సౌమిత్ర. పెద్దగా ప్రిపరేషన్‌ లేకుండానే ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లో 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించగలిగానని చెప్పాడు. ‘నేను జేఈఈ మెయిన్‌పై పూర్తిగా దృష్టి పెట్టలేదు. గత రెండేళ్లుగా IIT ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన JEE అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నాను. JEE మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో కొన్ని టాపిక్స్ మాత్రమే విభిన్నంగా ఉన్నాయి. అడ్వాన్స్ అనేది మెరుగైన, కష్టతరమైన పరీక్ష కాబట్టి, దాని కోసం కాన్సెప్ట్‌లను క్లియర్ చేయడం మెయిన్‌కి యూజ్ అయింది. ఐఐటీలో సీటు సంపాదించడమే నా ప్రధాన లక్ష్యం. అందుకే అడ్వాన్స్‌డ్ టెస్ట్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారు. మెయిన్స్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు.’ అని వివరించాడు.

తాను ఏ IITలో చదవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెబుతున్నాడు సౌమిత్ర. అయితే కచ్చితంగా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఎంచుకుంటానని మాత్రం తెలిపాడు. తనకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంటే ఇష్టమని, బీటెక్ సీఎస్‌లో ఈ రెండూ ఉంటాయి కాబట్టి ఇదే కోర్సు చేస్తానని చెప్పాడు.

చదువు ఒక్కటే కాదు..
IITల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ టెస్ట్‌ క్లియర్ చేయడమే ప్రస్తుతం తన లక్ష్యమని సౌమిత్ర చెబుతున్నాడు. ఇందుకు గత రెండు సంవత్సరాలుగా మీరట్‌లోని FIITJEE ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నాడు. JEE అడ్వాన్స్‌డ్‌కు ఇంకా 1.5 నెలలు టైమ్ ఉందని, ఈ టైమ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టానని చెప్పాడు. అయితే చదవడంతో పాటు సౌమిత్ర‌కు ఇతర వ్యాపకాలపై కూడా ఆసక్తి ఉంది. ఖాళీ టైమ్‌లో యోగా చేయడం, కవిత్వం, చిన్న కథలు రాయడం, నవలలు చదవడం అలవాటు చేసుకున్నాడు. వీలుంటే క్రికెట్ చూడటంతో పాటు ఆడతాడు కూడా. అయితే ప్రస్తుతానికి ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టి, ఈ అలవాట్లన్నీ మానేశాడు. తన కలల కాలేజీలో చేరిన తర్వాత ఈ ఆసక్తులన్నింటినీ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు సౌమిత్ర.

ఇదీ చదవండి:  Russia-Ukraine War: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..? ఇవిగో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?

తోటి విద్యార్థులకు టిప్స్..?
ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతున్నట్లు తోటి విద్యార్థులకు సౌమిత్ర కొన్ని సలహాలు ఇచ్చాడు. ప్రిపరేషన్‌ కోసం మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయని, మంచి రైటర్‌ రాసిన బుక్‌ను సెలక్ట్ చేసుకొని, దాన్ని డీప్‌గా ప్రిపేర్ అవ్వాలని సూచించాడు. ప్రిపరేషన్ కోసం కఠినమైన టైమ్‌టేబుల్‌ వంటివి ఏవీ ప్లాన్ చేసుకోలదని సౌమిత్ర చెబుతున్నాడు. దానికి బదులుగా కాన్సెప్ట్ క్లారిటీ, డిఫికల్టీ టాపిక్స్‌పై దృష్టి పెట్టడం యూజ్ అయిందని తెలిపాడు.కుటుంబంలోని ముగ్గురు తోబుట్టువులలో సౌమిత్ర చిన్నవాడు. తల్లి గృహిణి. తండ్రి ఫ్యామిలీ బిజినెస్ చేస్తుండగా, అన్నయ్య ఆయనకు సహాయం చేస్తుంటాడు. అక్క అసిస్టెంట్ ప్రొఫెసర్. జేఈఈ మెయిన్‌ సక్సెస్‌లో తన తోబుట్టువుల పాత్ర ఎంతో ఉందంటున్నాడు సౌమిత్ర. వారు తనను ఎంతగానో ప్రోత్సహించారని, సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా తీర్చిదిద్దారని చెప్పాడు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, IIT, Jee main 2022, JOBS

తదుపరి వార్తలు