హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Mega Job Mela: పది, ఇంటర్, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అలర్ట్.. నేడు మెగా జాబ్ మేళా నిర్వహణ.. వివరాలిలా..

Mega Job Mela: పది, ఇంటర్, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అలర్ట్.. నేడు మెగా జాబ్ మేళా నిర్వహణ.. వివరాలిలా..

Mega Job Mela: పది, ఇంటర్, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అలర్ట్.. నేడు మెగా జాబ్ మేళా నిర్వహణ.. వివరాలిలా..

Mega Job Mela: పది, ఇంటర్, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అలర్ట్.. నేడు మెగా జాబ్ మేళా నిర్వహణ.. వివరాలిలా..

తెలంగాణలో నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ జాబ్ మేళా (Job Mela) జరగనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఏపీలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో నేడు ఉదయం 10 గంటలకు భారీ జాబ్ మేళా (Job Mela) జరగనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. నేడు (ఆగస్టు 28) హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలోని శంషాబాద్ లో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళాను శంషాబాద్ లోని మల్లికా ఏసీ కన్సెన్షన్ లో నిర్వహించనున్నారు.


Telangana Jobs Study Material: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి స్టడీ మెటీరియల్.. విడుదల చేసిన కేటీఆర్


అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ కొరకు డైరెక్ట్ లింక్ గా ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా 80కి పైగా ప్రముఖ కంపెనీల్లో 7000లకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులు కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర ఏదైనా సందేహాలుంటే 9030047304 (Only Whatsapp), 7097655912 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.


ఏపీలో రేపు..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29న ఉదయం 8.30 నిమిషాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ Greentech Industries India Pvt Ltd సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను (Job Interviews) నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.ఖాళీలు, విద్యార్హతల వివరాలు: ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ట్రైనీ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ మెకానికల్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సు 18-29 ఏళ్లు ఉండడాలి. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది.


ఇతర వివరాలు: - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడపతారు. - ఎంపికైన వారు APIIC MP SEZ, Naidupeta చిరునమాలో పని చేయాల్సి ఉంటుంది. - అభ్యర్థులు ఇంటర్వ్యూలకు విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్యాట్యూటీ, బోనస్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ అన్ లిమిటెడ్ ఫుడ్ సదుపాయం ఉంటుంది. - ఇంటర్వ్యూలను SVA.Degree College, Pichatur Road, Srikalahasti, Tirupati చిరునామాలో నిర్వహించనున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Brand Hyderabad, Career and Courses, Hyderabad, Job Mela, JOBS, Private Jobs, Telangana Government

ఉత్తమ కథలు