నీట్ ర్యాంకు (NEET Rank) సాధించి డాక్టర్ (Doctor) కావాలని ఎందరో కలలు కంటూ ఉంటారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి కోచింగ్ సెంటర్లలో చేరతారు. కష్టపడి చదివి కొందరు నీట్ ర్యాంకు సాధిస్తారు. అయితే ఢిల్లీ (Delhi)లోని మోలార్‌బండ్‌లోని సర్వోద్య కన్యా విద్యాలయానికి (Sarvodya Kanya Vidyalaya) చెందిన రితిక (Ritika) ఎలాంటి కోచింగ్ లేకుండానే 2021 నీట్‌లో మంచి ర్యాంకు సాధించింది. ప్రైవేటు కోచింగ్ కేంద్రాల్లో చేరకుండానే రితిక ఈ ఘనత సాధించారు. కరోనా సమయంలో కూడా ఆమె ఎలాంటి ఆన్‌లైన్ తరగతులకు (Online classes) హాజరుకాలేదు. ప్రత్యేక స్టడీ మెటీరియల్ ఏమీ లేకుండానే నీట్‌లో ఉత్తీర్ణత సాధించింది.
తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో రితిక ఢిల్లీలోని బదర్‌పూర్ (badarpur)లో రెండు గదుల ఇరుకు ఇంట్లో నివశిస్తోంది. మొదట్లో రితికకు కనీసం మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కూడా లేదు. ఓ ప్రైవేట్ ఎంబ్రాయిడరీ కంపెనీలో తండ్రి ఉద్యోగం చేసేవారు. కరోనా సమయంలో ఆ ఉద్యోగం కూడా పోయింది. ‘‘భోజనం కోసం కూడా మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఇంటర్లో 93 శాతం మార్కులు రావడంతో, తల్లి వద్ద ఉన్న కొద్దిపాటి ఆభరణాలు, సోదరుడు రితిక పెళ్లికోసం పొదుపు చేసిన మొత్తంతో నాకు ఆండ్రాయిన్ ఫోన్ (Phone) కొనిచ్చారని’’ రితిక చెప్పారు. నీట్ 2021లో రితిక 500 మార్కులు సాధించి షెడ్యూల్డ్ కులాల (SC) విభాగంలో 3032 ర్యాంకు సాధించింది.
ప్రైవేటు కోచింగ్ తీసుకోలేకపోయాను..
‘‘ నేను ప్రైవేటు కోచింగ్ తీసుకోలేకపోయాను, కాబట్టి యూట్యూబ్, పుస్తకాల ద్వారా ఈ పరీక్షలకు సిద్దం అయ్యాను. మా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు చాలా సాయం చేశారు, ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించారు, పాఠశాల లైబ్రరీలో పుస్తకాలు చదువుకునేందుకు అనుమతించారని’’ రితిక చెప్పారు. ఈ ఏడాది ఢిల్లీ పాఠశాలల నుంచి 436 మంది నీట్ ఉత్తీర్ణత సాధించగా, అందులో యమునా విహార్ నుంచి 51, పాచిమ్ విహార్ నుంచి 28, ఐపీ ఎక్స్టెన్సన్ నుంచి 16, లోనీ రోడ్ నుంచి 15, మొలార్బాద్ నుంచి 15, రోహిణి స్కూల్ నుంచి 14 మంది నీట్ ఉత్తీర్ణత సాధించారు.
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన రితిక..
‘‘ గత ఏడాది మా పాఠశాల నుంచి 15 మంది నీట్‌కు అర్హత సాధించారు. గత సంవత్సరం 42మంది నీట్‌కు అర్హత సాధించగా, కోవిడ్ కారణంగా చాలా మంది విద్యార్థులు వలసపోయారు. కేవలం ఆన్ లైన్ తరగతులు (Only online classes) మాత్రమే నిర్వహించాం, విద్యార్థులకు నేరుగా పాఠాలు చెప్పలేకపోయాం. విద్యార్థులకు గైడ్ చేయడానికి పూర్వ విద్యార్థులను కూడా పిలిపించాం, మా ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల సందేహాలను తీర్చడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండేవారని’’ మోలార్‌బండ్‌లోని ఎస్కేవీ ప్రిన్సిపాల్ సుజాత తమటా చెప్పారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల నుంచి నీట్‌కు అర్హత సాధించడం అనేది గతంలో ఊహించలేనిది. విద్యార్ధులు, వారితల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషితో ఇది సాధ్యమైందని’’ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, Delhi, NEET 2021