Home /News /jobs /

A DANGEROUS ASTEROID FRAGMENT COMING CLOSE TO EARTH TODAY NIGHT PRV

Asteroid: నేడు భూమికి దగ్గరగా రాబోతున్న గ్రహ శకలం.. ప్రమాదకరమైనదంటూ నాసా ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సుమారు 4,500 అడుగుల వ్యాసం పరిమాణం కలిగిన ఒక కొత్త గ్రహశకలం నేడు భూమికి సమీపంగా వస్తోందట. ఈ గ్రహ శకలం పేరు 2016 AJ193గా యూఎస్​ స్పేస్​ ఎజెన్సీ నాసా(NASA) ప్రకటించింది. అయితే ఈ గ్రహశకలాన్ని(asteroid) నాసా ప్రమాదకరమైన (potentially hazardous) శకలాల జాబితాలో చేర్చడం కొంత ఆందోళన కలిగించే విషయమే.

ఇంకా చదవండి ...
    ఈ సౌర కుటుంబంలో గ్రహశకలాల(asteroid)కు కొదవే లేదు. వేలాది గ్రహ శకలాలు పయనిస్తూనే ఉంటాయి. అయితే ఇవి చిన్న రాయి పరిమాణం నుంచి భూమి(earth)కి వందరెట్ల పరిమాణంలోనూ ఉంటాయి. పాలపుంతలో ఆ శకలాలు ఎక్కడ తిరిగినా పరవాలేదులే కానీ, భూమి(earth)కి చేరువగా వచ్చినప్పుడే భయం భయంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే భూమి కంటే ఎక్కువ పరిమాణం(size)లో ఉన్న శకలాలు వాటి పయనంలో భూమివైపు దూసుకొచ్చి ఢీకొంటే అసలు మానవాళి అనేదే ఉండదు. భూమి బద్దలవడం ఖాయం. అందుకే గ్రహ శకలాలు భూమి వైపు వస్తున్నప్పుడు నాసా(NASA), ఇతర స్పేస్​ ఎజెన్సీలు అప్రమత్తంగా ఉంటాయి. ఒకవేళ అవి భూమిని ఢీకొట్టే అవకాశం ఉంటే వాటిని దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇందంతా ఎందుకంటారా? ఇవాళే ఓ గ్రహ శకలం భూమికి దగ్గరగా రాబోతుంది. ఒకటి కాదు రెండు ఏకంగా 4,500 అడుగుల వ్యాసం ఉన్న ఆ గ్రహ శకలం గంటకు 94,208 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందట. అయితే ఇవాళ ఏ సమయానికి అది భూమి వైపుకు వస్తుంది.. ఏదైనా ప్రమాదం ఉందా తెలుసుకుందాం..

    సుమారు 4,500 అడుగుల వ్యాసం పరిమాణం కలిగిన ఒక కొత్త గ్రహశకలం నేడు భూమికి సమీపంగా వస్తోందట. ఈ గ్రహ శకలం పేరు 2016 AJ193గా యూఎస్​ స్పేస్​ ఎజెన్సీ నాసా(NASA) ప్రకటించింది. అయితే ఈ గ్రహశకలాన్ని(asteroid) నాసా ప్రమాదకరమైన (potentially hazardous) శకలాల జాబితాలో చేర్చడం కొంత ఆందోళన కలిగించే విషయమే. ఆగస్టు 21 రాత్రి ఈ శకలం భూమికి చేరువగా వస్తుందని నాసా ప్రకటించింది. భూమికి చంద్రుడికి మధ్య ఉండే దూరంలో 9 రెట్ల దూరంలో ఈ శకలం భూమి వైపు పయనిస్తుందట. ఈ శకలం గంటకు 94,208 కిలోమీటర్ల భారీ వేగంతో ప్రయాణిస్తుందట. టెలిస్కోప్ ద్వారా చూస్తే కక్ష్యలో 1.4 కిలోమీటర్ల వెడల్పు గల గ్రహశకలం కదులుతున్నట్లు కనిపిస్తుందని శాస్త్రవేత్తలు(scientists) చెప్పారు. 2016 AJ193 గ్రహ శకలం మళ్లీ వచ్చే ఏడాది భూమికి మరింత దగ్గరగా వస్తుందని కూడా నాసా స్పష్టంచేసింది.

    గతంలోనూ ఓ శకలం భూమి వైపుకు దూసుకొచ్చింది. గత నెలలోనే 2008 GO20 అనే గ్రహ శకలం భూమికి సమీపం నుంచి పయనించింది. అయితే గ్రహశకలాల్ని గమనించడానికి నాసా దగ్గర ప్లానెటరీ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. త్వరలో నాసా ... డబుల్ ఆస్టరాయడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) మిషన్ ద్వారా పంపబోతోంది. ఈ మిషన్ ఉద్దేశం ఏంటంటే ... వేగంగా దూసుకెళ్లి ... 780 మంది సైజు ఉన్న ఆస్టరాయిడ్ డిడిమోస్ (డిడిమోస్) ను ఢీకొట్టడం. ఇందుకోసం ఆ మిషన్ సెకండ్‌కి 6.6 కిలోమీర్ల వేగంతో వెళ్లనుంది. 2022 అక్టోబర్‌లో ఈ విధ్వంసం జరగనుందని అంచనా. ఇలా ఎందుకంటే ... భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమివైపు వస్తూ ఉంటే ... అది రాకముందే దాన్ని పేల్చేయాలన్నది నాసా ప్లాన్. అందులో ఇది తొలి ప్రయోగం అన్నమాట.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Asteroid, Earth, Trending news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు