Home /News /jobs /

A COMMITTEE WILL BE APPOINTED TO FILL 80000 VACANCIES IN TELANGANA VB

Telangana Government Jobs: గుడ్ న్యూస్.. ఈ సారి 80 వేల ఉద్యోగాల భర్తీ పక్కా..! అందుకే ఈ కమిటీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Government Jobs: తాజాగా తెలంగాణలో కొత్తగా చేపట్టనున్న ఉద్యోగ నియామకాలపై విధివిధానాల రూపకల్పనకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.

ఇంకా చదవండి ...
    తెలంగాణ ఏర్పాటు అయిన దగ్గర నుంచి నిరుద్యోగులు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల (Government Jobs) కోసం ఎదురు చూశారు. చూస్తున్నారు కూడా. అయితే నోటిఫికేషన్లు అనేవి ఎక్కువగా విడుదల చేయడం లేదనేది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేసిన వాటిలో కూడా ఎక్కవగా పోలీస్ నోటిఫికేషన్లు మాత్రమే ఉన్నాయని.. జనరల్ నోటిఫికేషన్లు (Notifications) ఎక్కువగా విడుదల చేయలేదని వాపోతున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటానమని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యే చాలా సందర్బాల్లో అన్నారు.

    Weight Loss Drink: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా.. రాత్రి పడుకునే ముందు ఇవి ట్రై చేయండి.. వారంలోనే ఫలితం


    సీఎం కేసీఆర్ కూడా చాలాసార్లు ప్రస్తావించారు కూడా. వాటి భర్తీని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి.. డిపార్ట్ మెంట్ వారీగా పోస్టుల వివరాలను కూడా తెప్పించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఖాళీల భర్తీ చేస్తామని ప్రభుత్వ అధికారులు దుబ్బాక ఉప ఎన్నికల దగ్గర నుంచి జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో మాత్రమే చెబుతున్నారని.. ఇది కేవలం నిరుద్యోగులకు ఆశ చూపించి.. ఓట్లను దండుకునే ప్రక్రియే అని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల దీనిపై కేసీఆర్ రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు.

    Top Engineering Colleges: ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే, దేశవిదేశాల్లోని టాప్​ 15 ఇంజినీరింగ్ కాలేజీలివే..


    Vitamin D: విటమిన్ డీ లోపంతో బాధపడే వారు.. చలికాలంలో ఇలాంటి ఫుడ్స్ తీసుకోండి..


    అయితే తాజాగా తెలంగాణలో కొత్తగా చేపట్టనున్న ఉద్యోగ నియామకాలపై విధివిధానాల రూపకల్పనకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. జోనల్‌ విధానంలో ఉద్యోగుల సర్దుబాటు అనంతరం నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. దీనికి అనుగుణంగా ఖాళీల భర్తీకి విధివిధానాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14 న తెలంగాణ కేబినెట్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది.

    Best Business Idea: కేవలం రూ. 9వేల పెట్టుబడి.. రాబడి రూ.కోటి.. అదేంటో ఓ లుక్కేయండి..


    సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే భేటీలో కూడా పలు కీలక అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరి చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, నెలలోపు పంటల సాగుపై అవగాహన కల్పించడంపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.  నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యలో దాదాపు 80 వేల జాబ్‌లకు సంబంధించి నోటిఫికేషన్ల జారీ చేసేందుకు కేబినెట్‌లో పచ్చజెండా ఊపనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే భర్తీ ప్రక్రియకు సంబంధించి విధివిధానాలకు కమిటీని నియమించనుండగా.. ఉద్యోగాల భర్తీ వేగంగా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిరుద్యోగుల్లో కాస్తంత ఆశలు రేకెత్తాయి.
    Published by:Veera Babu
    First published:

    Tags: CM KCR, Jobs in telangana, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు