Home /News /jobs /

Work From Home: మరో రెండేళ్లు ఇండియాలో వర్క్ ఫ్రం హోం.. తాజా సర్వేలో తేలిన విషయాలివే..

Work From Home: మరో రెండేళ్లు ఇండియాలో వర్క్ ఫ్రం హోం.. తాజా సర్వేలో తేలిన విషయాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మెజార్టీ సంస్థలు వర్క్ ఫ్రం హోంను మరో రెండేళ్ల పాటు కొనసాగించే ఛాన్స్ ఉందని తాజా సర్వేలో తెలింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    కరోనా నేపథ్యంలో అనేక సంస్థలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తమ ఉద్యోగులకు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే కంపెనీలకు తమ సేవలు అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కంపెనీలకే మేలు జరిగింది. మెయింటెనెన్స్, ఇతర ఖర్చులు భారీగా తగ్గాయి. ఉత్పత్తి కూడా పెరిగింది. అయితే కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం మరికొన్ని రోజులు కొనసాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై కేంద్రంగా పని చేస్తున్న జోహో కార్పొరేషన్ కు చెందిన ఐటీ మేనేజ్మెంట్ విభాగం మేనేజ్ ఇంజిన్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తి కరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇండియాలో 95 శాతానికి పైగా సంస్థలు మరో రెండేళ్ల పాటు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని సర్వేలో తేలింది.
    IGNOU: 2021-22 విద్యా సంవత్సరానికి ఇగ్నో కొత్త కోర్సులు.. దూర విద్య ద్వారా సర్టిఫికేట్లు

    ఈ సర్వేలో నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, ఇండియాకు చెందిన 1210 మంది ఐటీ ఎగ్జిక్యూటీవ్స్ మరియు టెక్నాలజీ ప్రొఫెషినల్స్ పాల్గొన్నారు. ఇండియా నుంచి 500లకు పైగా ఉద్యోగులు కలిగిన 202 సంస్థల ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఇందులో 89 శాతం సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానం కారణంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సవాళ్లు తమకు ఎదురవుతున్నాయని తెలిపాయి.

    తమ ఉద్యోగులు వాడే కంప్యూటర్లు, పరికారాలలో వాడే సాఫ్ట్ వేర్స్ విషయంలో తమకు ఎలాంటి నియంత్రణ ఉండడం లేదని ఆయా కంపెనీలు వెల్లడించాయి. ఇంకా దాదాపు 97 శాతం కంపెనీలు క్లౌడ్ సొల్యూషన్స్ వాడుతున్నట్లు తెలిపాయి. 96 శాతం సంస్థలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్ లలో రెండేళ్లుగా అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీలను వాడుతున్నట్లు వివరించాయి.

    ఇదిలా ఉంటే.. కరోనా కాలంలోనూ ఐటీ ఉద్యోగులకు కలిసి వస్తుందట. ఐటీ ఉద్యోగుల‌కు డిమాండ్ అమాంతం పెరిగడమే ఇందుకు కారణం. కోవిడ్ కార‌ణంగా వ్యాపార సంస్థ‌ల‌న్నీ డిజిట‌ల్ బాట‌ప‌ట్ట‌డానికి మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ వివపరీతంగా పెరిగింది. దీంతో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్టుకోవాల‌ని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. దీంతో కంపెనీ మారేట‌ప్పుడు ఏకంగా 70శాతం ఇంక్రిమెంట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు కొన్ని ఆఫ‌ర్ల‌ను కూడా వ‌దులుకుంటున్నార‌ని ఐటీ రిక్రూట్‌మెంట్ సంస్థ‌లు చెపుతున్నాయి. అయితే కంపెనీలు సైతం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చి మ‌రీ ఐటీ ఉద్యోగుల‌ను ఎగ‌రేసుకుపోతున్నాయట.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Company, Corona, Information Technology, Software developer, Work From Home

    తదుపరి వార్తలు