news18-telugu
Updated: May 3, 2019, 12:17 PM IST
SBI clerk Jobs: ఎస్బీఐలో 8,653 క్లర్క్ ఉద్యోగాలు... ఇవాళే లాస్ట్ డేట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8,653 క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం 8,653 క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్‌లో 425 ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు sbi.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 3న ముగుస్తుంది. దేశంలోని అన్ని బ్రాంచుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్బీఐ. ప్రిలిమినరీ ఎగ్జామ్ 2019 జూన్‌లో నిర్వహించే అవకాశముంది. మొత్తం 8,653 క్లర్క్ పోస్టుల్లో 3,674 జనరల్ కేటగిరీకి, 853 ఆర్థికంగా వెనకబడిన తరగతులకు, 1,361 పోస్టులు షెడ్యూల్డ్ కులాలకు, 799 పోస్టులు షెడ్యూల్డ్ తెగలకు, 1,966 పోస్టుల్ని ఓబీసీలకు కేటాయించారు. 20 నుంచి 28 ఏళ్ల వయస్సు గల వారంతా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది. మొత్తం ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

image: SBI
SBI clerk 2019 notification: దరఖాస్తు చేయండి ఇలా...
ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ www.sbi.co.in ఓపెన్ చేయండి.
ఎస్బీఐ వెబ్సైట్లో 'Career' పేజీ క్లిక్ చేయండి.
అందులో 'recruitment for junior associates' లింక్ పైన క్లిక్ చేయండి.
ముందుగా 'Download Advertisement' నోటిఫికేషన్ మొత్తం చదవండి.ఆ తర్వాత 'Apply Online' క్లిక్ చేసి దరఖాస్తును పూర్తి చేయండి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
SBI clerk 2019 notification: ఫీజు వివరాలు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.125
జనరల్, ఆర్థికంగా వెనకబడిన తరగతులు, ఓబీసీ అభ్యర్థులకు రూ.750
Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్... రిలీజైన రెడ్మీ వై3
ఇవి కూడా చదవండి:
Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి
Amazon Pay: ఇక అమెజాన్ పే నుంచి మనీ ట్రాన్స్ఫర్... ఇలా చేయొచ్చు
WhatsApp IPL Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్లోడ్ చేసుకోండి ఇలా
First published:
May 3, 2019, 12:17 PM IST