Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 84,037 ఖాళీలు భర్తీ చేయనున్న కేంద్రం

Central Armed Police Forces Vacancies | ఖాళీలను భర్తీ చేసేందుకు వేగవంతమైన చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్త పోస్టులు రావడం, భర్తీ చేయడం నిరంతరం సాగే ప్రక్రియ అని లోక్‌సభకు స్పష్టం చేసింది.

news18-telugu
Updated: June 26, 2019, 12:24 PM IST
Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 84,037 ఖాళీలు భర్తీ చేయనున్న కేంద్రం
Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 84,037 ఖాళీలు భర్తీ చేయనున్న కేంద్రం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో 84,037 పోస్టుల్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తామంటోంది కేంద్రం. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF, సహస్త్ర సీమా బల్-SSB, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్-ITBP, అస్సాం రైఫిల్స్-AR విభాగాలున్నాయి. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు ఉండాలి. కానీ 84,037 ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు వేగవంతమైన చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్త పోస్టులు రావడం, భర్తీ చేయడం నిరంతరం సాగే ప్రక్రియ అని లోక్‌సభకు స్పష్టం చేసింది.

కేంద్ర సాయుధ పోలీసు దళాల్లోని ఆయా విభాగాల్లో రిటైర్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్, ఉద్యోగుల మరణం కారణంగా ఖాళీలు ఏర్పడ్డాయి. వేర్వేరు గ్రేడ్స్‌లో ప్రతీ సంవత్సరం సగటున 10 శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి స్థిరమైన నియామక ప్రక్రియ ఉంది. ప్రస్తుతం 84,037 ఖాళీలున్నాయి.
లోక్‌సభకు రాతపూర్వకంగా హోమ్ మంత్రిత్వ శాఖ సమాధానం


2015-16 నాటి నియామకాల్లో భాగంగా 57,268 కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2017లో భర్తీ చేసింది. ఇక 2018లో 58,373 కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాత పరీక్ష నిర్వహించింది. దాంతో పాటు 1,094 సబ్-ఇన్‌స్పెక్టర్(జనరల్ డ్యూటీ) పోస్టులకు కూడా 2018లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది. ఇక 2018లో 466 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు యూపీఎస్‌సీ పరీక్షలు నిర్వహించింది. 2019లో 323 అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.



Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

SBI Loan: చదువుకోవడానికి ఎస్‌బీఐ లోన్... అప్లై చేయండి ఇలా

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఇంజనీర్, సూపర్‌వైజర్ ఉద్యోగాలు

Air Force Jobs: యువకులకు శుభవార్త... ఆగస్ట్‌లో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు