హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Survey: విద్యార్థులను తీర్చిదిద్దే విధానం మార్చాలి.. హెచ్‌ఆర్ లీడర్స్‌ ఏం చెప్పారంటే?

Survey: విద్యార్థులను తీర్చిదిద్దే విధానం మార్చాలి.. హెచ్‌ఆర్ లీడర్స్‌ ఏం చెప్పారంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థులకు ఉపాధి కోసం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్‌ ఇచ్చే విధానాన్ని ఉన్నత విద్యాసంస్థలు మార్చాల్సిన అవసరం ఉందని కొందరు హెచ్‌ఆర్‌ లీడర్స్‌ చెబుతున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మార్కెట్‌లోకి కొత్త రకాల టెక్నాలజీలు (Technology's) వేగంగా వస్తున్నాయి. అయితే కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థుల్లో (Students) మార్కెట్‌ అవసరాలను తీర్చే నైపుణ్యాలు ఉండటం లేదు. అయితే విద్యార్థులకు ఉపాధి (Employment) కోసం సాఫ్ట్ స్కిల్స్ (Soft Skills) ట్రైనింగ్‌ ఇచ్చే విధానాన్ని ఉన్నత విద్యాసంస్థలు మార్చాల్సిన అవసరం ఉందని కొందరు హెచ్‌ఆర్‌ లీడర్స్‌ చెబుతున్నారు. వర్క్‌ఫోర్స్ ట్రెండ్స్‌పై BML ముంజాల్ యూనివర్సిటీ (BMU) ఈ సర్వే చేపట్టింది. సర్వే రిపోర్ట్‌ను ‘ఫ్యూచర్ ఆఫ్ వర్క్ & హ్యూమన్ ఛాలెంజెస్: టెక్నాలజీ & బియాండ్’ పేరుతో విడుదల చేసింది. పని భవిష్యత్తు టెక్నాలజీతో ఎలా రూపుదిద్దుకోబోతోంది, వ్యాపార సెంటిమెంట్, ఇప్పటికే ఉన్న నైపుణ్యాల అంతరం, ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు భవిష్యత్తులో మరింత ఉపాధి కల్పించడంలో ఉన్నత విద్యా సంస్థల పాత్రపై హెచ్‌ఆర్ లీడర్‌లతో జరిపిన సర్వేలో కనుగొన్న విషయాలను నివేదిక వెల్లడించింది.

విద్యార్థులను మార్కెట్‌ అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దడం, నైపుణ్యాలు పెంచడంపై నిర్వహించిన సర్వేలో 84 శాతం మంది హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్స్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 43 శాతం మంది కమ్యూనికేషన్, క్రియేటివిటీ, రెసిలియన్స్‌, ఎంపతీ, ఇంటెగ్రిటీ వంటి సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టి సారించాలన్నారు. 21 శాతం మంది విద్యార్థులను వాస్తవ ప్రపంచం కోసం సిద్ధం చేయడానికి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అవసరమని అభిప్రాయపడ్డారు. లెర్నర్స్ మైండ్ సెట్, క్యూరియాసిటీని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని 18 శాతం మంది చెప్పారు. విద్యార్థులకు అనిశ్చితి పట్ల సహనం, చొరవ పట్ల క్యూరియాసిటీ ఉండాలని, అప్పుడే వర్కింగ్ వరల్డ్‌ను మార్చగలరని 30 శాతం మంది హెచ్‌ఆర్ లీడర్‌లు సూచిస్తున్నారు.

మూడు సంవత్సరాల్లోపు వ్యాపార వృద్ధి

ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. రాబోయే 1 నుంచి 3 సంవత్సరాలలో తమ సంస్థ వ్యాపార వృద్ధి మెరుగవుతుందని HR లీడర్స్‌ చెబుతున్నారు. 89 శాతం మంది తమ సంస్థలు బలమైన వృద్ధిని నమోదు చేయాలని చూస్తుండగా.. దీనిపై మార్కెట్ అస్థిరత 36 శాతం, ద్రవ్యోల్బణం 21 శాతం, భవిష్యత్ కోవిడ్-19 వేరియంట్‌లు 23 శాతం ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 13 శాతం మంది మాత్రమే ప్రతిభ లేదా నైపుణ్యాల కొరతను వృద్ధికి సవాలుగా పేర్కొన్నారు. 49 శాతం మంది హెచ్‌ఆర్‌ లీడర్స్‌ ఐటీ, మొబైల్ , డేటా అనలిటిక్స్, R&D వ్యాపార రంగాలలో నైపుణ్యాల అంతరాలను ఎక్కువగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్, సేల్స్ & మార్కెటింగ్‌లో నైపుణ్యాల కొరత 12 శాతం చొప్పున ఉన్నాయని చెప్పారు.

Career In Chef: చెఫ్‌గా మారాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేస్తే.. నెలకు రూ.లక్షల్లో సంపాదించొచ్చు..

43 శాతం మంది హెచ్‌ఆర్ లీడర్‌లు ఉద్యోగులను రీస్కిల్లింగ్ చేయడం తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఆపై ప్రతిభ ఉన్నవాళ్లను రిక్రూట్‌ చేసుకోవడంపై దృష్టి పెట్టామని 26.6 శాతం మంది అన్నారు. కోవిడ్‌ 19 తర్వాత ప్రతిభ ఉన్న ఉద్యోగులను ఆఫీసులకు తీసుకురావడం, ఆఫీస్‌ సవాళ్లను నావిగేట్ చేయడం అవసరమని 18 శాతం చెప్పారు.

నైపుణ్యాల అంతరం తగ్గించాలి

తమ సంస్థల్లోని నైపుణ్యాల అంతరాన్ని పరిష్కరించడానికి ఫ్రెషర్లను రిక్రూట్ చేయాలని 38 శాతం హెచ్‌ఆర్ లీడర్లు చూస్తున్నారు. తర్వాత మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్‌లో 30 శాతం చొప్పున ఉండాలని చెబుతున్నారు. సాఫ్ట్-స్కిల్స్‌కు కొత్త వర్క్ ఆర్డర్ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 38 శాతం మంది సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పలేమన్నారు. అభ్యర్థుల్లో సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం కంపెనీ ఉత్పాదకతను పరిమితం చేస్తుందని 31 శాతం మంది పేర్కొన్నారు.

మూన్‌లైటింగ్‌పై భిన్నాభిప్రాయాలు

ఉద్యోగులు రివార్డ్, ప్రోత్సహించడానికి సంస్థలు ఎలా ఎంచుకుంటున్నాయనే దానిలో కూడా కొత్త పని క్రమం స్పష్టంగా కనిపిస్తుంది. హెచ్‌ఆర్ లీడర్‌లు ఉద్యోగులను ప్రోత్సహించడానికి కృషి, విజయాలు రెండింటినీ సమానంగా చూస్తారు. టీమ్‌వర్క్‌ను 57 శాతం మంది, సృజనాత్మకత 54 శాతం, కమ్యూనికేషన్ అవసరమని 50 శాతం మంది చెప్పారు. ఎక్కువ మంది హెచ్‌ఆర్ లీడర్స్‌ మూన్‌లైటింగ్ ట్రెండ్‌ సరైనదేనన్నారు. 43 శాతం మంది అనుకూలంగా లేమని, చీటింగ్ అని పేర్కొన్నారు.

ఐఐఐటి ఢిల్లీ చైర్మన్ & నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్ కార్నిక్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఉద్యోగాలకు సంబంధించి భవిష్యత్తులో వివిధ ప్రత్యామ్నాయాలు ఉండవచ్చన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా రోబోట్‌లను బెదిరింపులుగా చూడడానికి ఎటువంటి కారణం లేదన్నారు. భవిష్యత్తు మనిషి లేదా మెషిన్ డైకోటమీ కాదని, కానీ మ్యాన్ ప్లస్ మెషిన్ మోడల్ అని వివరించారు.

First published:

Tags: Colleges, JOBS, Students

ఉత్తమ కథలు