82 PER CENT OF INDIAN EMPLOYEES WANTS TO CHANGE THEIR JOBS IN 2022 AS PER LINKEDIN SURVEY FULL DETAILS HERE PRN GH
Job Change: ఉద్యోగ మార్పుపై 82శాతం భారతీయుల ఆశక్తి... తాజా సర్వేలో వెల్లడి.. కారణం ఇదే..!
ప్రతీకాత్మకచిత్రం
Job Change: కరోనా పరిస్థితుల్లో ఉద్యోగం ఊడిపోకుండా ఉంటే చాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతీయ ఉద్యోగులు తమ ఉద్యోగ భవిష్యత్తు గురించి పాజిటివ్ ఉన్నారని ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వేలో తేలింది.
మంచి జీతం, హోదా వస్తే చాలు ప్రతి ఒక్కరూ ప్రస్తుత ఉద్యోగం (Job) వదిలేయాలని చూస్తుంటారు. ఐతే కరోనా (Corona) పరిస్థితుల్లో ఉద్యోగం ఊడిపోకుండా ఉంటే చాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతీయ ఉద్యోగులు తమ ఉద్యోగ భవిష్యత్తు గురించి పాజిటివ్ ఉన్నారని ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డ్ఇన్ (LinkedIn) నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే కొత్త ఏడాదిలో దేశంలోని 82 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత కంపెనీ లేదా ఉద్యోగాన్ని మార్చుకునే యోచనలో ఉన్నారని లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 1,111 మంది వృత్తి నిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా లింక్డ్ ఇన్ ఈ రీసెర్చ్ రిపోర్డును రూపొందించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది ఉద్యోగం మారేందుకు ఆసక్తి చూపించారు. కొత్త ఉద్యోగాలను అన్వేషించే వారిలో ఫ్రెషర్లు లేదా ఒక ఏడాది అనుభవం ఉన్న వారే 94 శాతం మంది ఉన్నారని నివేదిక తేల్చి చెప్పింది.
ఇక, జెడ్ జనరేషన్ (1990–2000 సంవత్సరాల మధ్య పుట్టిన వారు) ఉద్యోగుల్లో 87 శాతం మంది ఉద్యోగం మారాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి ఎందుకు మారాలనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. 30 శాతం మంది పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నమని చెప్పారు. శాలరీ సరిపోవట్లేదని 28 శాతం, కెరీర్ గ్రోత్ కోసం అని 23 శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాల అన్వేషణలో అనుకూల పనివేళలకే మొదటి ప్రాధాన్యమిస్తామని ఎక్కువ మంది ఉద్యోగులు చెప్పారు. ఏదేమైనప్పటికీ, ఎక్కువ మంది ఉద్యోగులు భవిష్యత్తులో ఉద్యోగ లభ్యతపై ఆశాభావంతో ఉన్నారు.
1,111 మంది వృత్తి నిపుణులపై సర్వే..
మరోవైపు, పని పరంగా సౌకర్యవంతమైన ఏర్పాట్లు, ఉద్యోగ భద్రత తమకు ప్రాధాన్య అంశాలుగా ఎక్కువ మంది చెప్పుకొచ్చారు. చేస్తున్న పని, జీవన సమతుల్యత సరిగ్గా లేకపోవడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులు 1.3 రెట్లు అధికంగా ఉద్యోగాన్ని వీడే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. మరోవైపు, మెరుగైన వేతనం ఇస్తే ప్రస్తుత కంపెనీతోనే కొనసాగుతామని 49 శాతం మంది మహిళలు చెప్పగా.. పురుషుల్లో ఇది కేవలం 39 శాతంగానే ఉంది. కాగా, 71 శాతం మంది నిపుణులు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో చేస్తున్న పనిలో తమ నైపుణ్యాలను ప్రశ్నించుకుంటున్నట్లు లింక్డ్ఇన్ సర్వే పేర్కొంది.
ఇక 30 శాతం మంది నిపుణులు కరోనా తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసిందని చెప్పారు. 40 శాతం మంది తమ సహోద్యోగులు లేదా కార్యాలయంలోని టీమ్ లీడర్ల సపోర్ట్ లేకపోవడం వల్ల కలత చెందుతున్నట్లు చెప్పుకొచ్చారు. 34 శాతం మంది కొత్త బాధ్యతలు చేపట్టడం పట్ల సుముఖంగా లేనట్లు తేల్చి చెప్పారు. కాగా, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, డేటా సైన్స్ స్పెషలిస్ట్, మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్, బిజినెస్ డెవలప్మెంట్ టాలెంట్ వంటి జాబ్ రోల్స్‌లో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులకు పెరుగుతున్న డిమాండ్‌ను సర్వే హైలైట్ చేసింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.