Home /News /jobs /

7TH PAY COMMISSION UPDATES WHEN 7TH CPC DA BENEFIT MAY RESUME HERE FULL DETAILS NS GH

7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​​.. మరోసారి డీఏ పెంపు వాయిదా.. ఎప్పటి నుంచి అమలంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న మూడు డీఏ బకాయిలను జూలై 1 నుంచి చెల్లిస్తారని భావించిన ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన మూడు డీఏ బకాయిలను జూలై 1 నుంచి చెల్లిస్తారని భావించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. 7వ వేతన సంఘంలో భాగంగా డిఎ - DA (డియర్​నెస్​ అలవెన్స్​), డిఆర్ - DR (డియర్​నెస్​ రిలీఫ్​) ప్రయోజనాలను అమలు చేసేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈ మేరకు సెప్టెంబర్​ నుంచి ఉద్యోగులకు డీఏ పెంపు అమల్లోకి రానుందని భారత క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఆర్థిక, డిఓపిటి (డిపార్ట్​మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  డీఏ, డిఆర్ ప్రయోజనాలను ఎప్పుడు అందజేసే విషయంపై జెసిఎం జాతీయ మండలి కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘2021 జూన్ 26న జరిగిన సమావేశంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎ, పెన్షనర్ల డిఆర్ ప్రయోజనాలపై చర్చ జరిగింది. వీటిని జూలై 1 నుంచే అమలు చేయాలని తొలుత భావించినప్పటికీ, కొన్ని పరిస్థితుల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది.  అయితే.. సెప్టెంబర్ నుంచి విధిగా ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ అందుకుంటారు" అని పేర్కొన్నారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు డీఏ బకాయిలను చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి ఇలా మూడు డీఏ బకాయిలను వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు, వీటికి సెప్టెంబర్​లో మోక్షం లభించనుంది.
Salary Hike: ఉద్యోగులకు అలర్ట్... వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం పెరుగుతుంది

1.12 కోట్ల మందికి ప్రయోజనం..
డీఏ, డీఆర్ పెంపు నిర్ణయాన్ని అమలు చేసే ముందు క్యాబినెట్ కార్యదర్శి తమ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్​ చర్చించి ఆమోదం ముద్ర వేశాక ఇది అమల్లోకి వస్తుంది. తద్వారా, 7 వ వేతన కమిషన్ డిఎ, డిఆర్ ప్రయోజనాలు తిరిగి ప్రారంభమవుతాయి. డీఏ, డీఆర్​ పెంపు నిర్ణయంతో సుమారు 1.12 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

కాగా, సెప్టెంబర్​ నుంచి డీఏ పెంపు అమల్లోకి రానున్నందున.. డీఏ బకాయిలను అందుకోవడానికి ఉద్యోగులు మరో రెండు నెలలు వేచి ఉండాల్సి ఉంది. అయితే, ఎంత మొత్తంలో డీఏ రానుందనేది ఆసక్తికరమైన అంశం. 2020 జనవరిలో 4 శాతం, 2020 జూలైలో 3 శాతం, 2021 జనవరిలో 4 శాతం డీఏ రావాల్సి ఉంది. దీనితో పాటు ఈ నెల నుంచి 3 శాతం లేదా 4 శాతం కొత్తగా డీఏ అమలు కావాల్సి ఉంది. వీటన్నింటినీ లెక్కిస్తే (17 + 4 + 3 + 4 + 3/4) ప్రస్తుతం అమల్లో ఉన్న డీఏ, డీఆర్ 17 శాతం నుంచి 31 లేదా 32 శాతానికి చేరుకోనుంది. దీంతో సెప్టెంబర్​ నుంచి ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 7th Pay Commission, Central govt employees

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు