7th Pay Commission: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా

7th Pay Commission: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా (ప్రతీకాత్మక చిత్రం)

7th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టులో డబుల్ బొనాంజా రానుంది. పెరిగిన డీఏ అమలుతో పాటు మరో గుడ్ న్యూస్ కూడా ఉంది.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన డీఏ 2021 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే పెరిగిన డీఏతో ఆగస్ట్ వేతనం వస్తుంది. ఇప్పటివరకు 17 శాతం డీఏ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా మరో 11 శాతం డీఏ పొందనున్నారు. దీంతో వారికి ఆగస్టులో వచ్చే వేతనంలో 28 శాతం డీఏ వస్తుంది. ఇదొక్కటే కాదు... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త కూడా ఉంది. దీంతో ఆగస్టులో డబుల్ బొనాంజా కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం హెచ్ఆర్ఏ కూడా పెంచనుంది. 2017 జూలై 7న డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ జారీ చేసిన ఓ ఆర్డర్ ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 25 శాతం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు హౌజ్ రెంట్ అలవెన్స్-HRA కూడా సవరించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుంచి 28 శాతం డీఏ అమల్లోకి రావడంతో హెచ్ఆర్ఏ కూడా సవరించారు.

    IRCTC Special Tourist Train: సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి వారణాసికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్

    SBI New Feature: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... వెంటనే ఈ ఫీచర్ వాడుకోండి

    ఆగస్టులో వచ్చే వేతనంలో డీఏ పెరగడంతో పాటు హెచ్ఆర్ఏ కూడా పెరుగుతోంది. హెచ్ఆర్ఏ వేర్వేరు కేటగిరీల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉద్యోగులకు 1 నుంచి 3 శాతం హెచ్ఆర్ఏ పెరగొచ్చు. 50 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే ఎక్స్ కేటగిరీ, 5 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే వై కేటగిరీ, 5 లక్షల లోపు జనాభా ఉంటే జెడ్ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఎక్స్ క్లాస్ పట్టణాల్లో నివసించేవారికి బేసిక్ పేలో 27 శాతం హెచ్ఆర్ఏ, వై క్లాస్ పట్టణాల్లో నివసించేవారికి 18 శాతం హెచ్ఆర్ఏ, ఇక జెడ్ క్లాస్ పట్టణాల్లో నివసించేవారికి 9 శాతం హెచ్ఆర్ఏ లభించే అవకాశముంది. ప్రస్తుతం ఎక్స్ క్లాస్ హెచ్ఆర్ఏ 24 శాతం, వై క్లాస్ హెచ్ఆర్ఏ 16 శాతం, జెడ్ క్లాస్ హెచ్ఆర్ఏ 8 శాతం వస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే హెచ్ఆర్ఏ వివరాలు చూస్తే ఎక్స్ క్లాస్ పట్టణాల్లో రూ.5,400, వై క్లాస్ పట్టణాల్లో రూ.3,600, జెడ్ క్లాస్ పట్టణాల్లో రూ.1,800 లభిస్తుంది. ఇక డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరుకుంటే గరిష్టంగా హెచ్ఆర్ఏ 30 శాతం ఇవ్వాలి.

    EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌ను తక్కువ అంచనా వేయొద్దు... కోటీశ్వరులు కావొచ్చు ఇలా

    Airtel Plans: రూ.299 నుంచి ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ తెలుసుకోండి

    ఇక డీఏ పెరగడంతో ఉద్యోగులకు రూ.2,000 నుంచి రూ.25,000 వరకు వేతనం పెరిగే అవకాశం ఉంది. రూ.18,000 నుంచి రూ.29,200 మధ్య బేసిక్ వేతనం ఉన్నవారికి రూ.1,980 నుంచి రూ.3,212 వరకు, రూ.35,400 నుంచి రూ.53,100 బేసిక్ వేతనం ఉన్నవారికి రూ.3,894 నుంచి రూ.5,841 వరకు, రూ.56,100 నుంచి రూ.2,50,000 బేసిక్ వేతనం ఉన్నవారికి రూ.6,000 నుంచి రూ.25,000 వరకు వేతనం పెరగనుంది.
    Published by:Santhosh Kumar S
    First published: