దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల ఎదురుచూపులు ఫలించేలా కన్పిస్తున్నాయి. కరోనా విజృంభన కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు జూన్ 1న ప్రకటించే అవకాశం ఉంది. 7వ వేతన సవరణ సంఘం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికను అందించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జెసిఎం) స్టాఫ్ సైడ్ ప్రకారం, వచ్చే నెల నుంచి డీఏ అమలు కానుందని తెలుస్తోంది. ఈసారి డిఎ పెంపు కనీసం 4 శాతం వరకు ఉంటుందని జెసిఎం అంచనా వేసింది. దీనిపై జేసీఎం ఉద్యోగుల విభాగం కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ ‘‘డీఏ పెంపు అంశంపై మేము ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డీఓపీటీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల ఏప్రిల్ తొలి వారంలోనే ప్రకటించాల్సిన డీఏ పెంపుదలను తొలుత మే, ఆ తర్వాత జూన్‌కు వాయిదా వేసినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే, ఈ సారి వాయిదా పడకపోవచ్చని వారు తెలిపారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. మళ్లీ నిరాశే.. పూర్తి వివరాలివే..
డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాప్యం చేసింది. మరోసారి ఈ జాప్యం ఉండబోదని మేం ఆశిస్తున్నాం.” అని ఆయన వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జూన్ లేదా జులై నెలల్లో డీఏ పెంచుతామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే రాజ్యసభలో హామీ సైతం ఇచ్చిన సంగతిని మిశ్రా గుర్తు చేశారు. అయితే, 2021 జనవరి 1 నుంచి డీఏ పెంపు ప్రకటించినప్పటికీ, జూలై 1 నుండి మాత్రమే ఇది పునరుద్ధరించబడుతుంది.
4 శాతం పెరగనుందా?
గత ఏడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ద్రవ్యోల్భనం 3.5 శాతంగా నమోదైందని, దీన్ని ఆధారంగా చేసుకుంటే.. ఉద్యోగి బేసిక్ వేతనంలో డీఏ పెంపు కనీసం నాలుగు శాతంగా ఉండవచ్చని తాము అంచనా వేస్తున్నట్లు శివ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం ఇప్పటికీ మూడు డీఏ బకాయిలను చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బకాయిలను ఏక మొత్తంలో అందరికీ విడుదల చేయలేకపోతే.. కనీసం విడతల వారీగానైనా చెల్లించాలని తాము ఇదివరకే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా, కరోనా వల్ల ఆపేసిన డీఏ బకాయిలతో పాటు కొత్త డీఏ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు మరింత పెరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 7th Pay Commission, Central govt employees, Centre government