• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • 7TH PAY COMMISSION CENTRAL GOVERNMENT MAY NOT SETTLE DA ARREARS ON JULY 1 SS GH

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్... ఓ బ్యాడ్ న్యూస్

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్... ఓ బ్యాడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)

7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై 1 కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కానీ వారికి ఓ గుడ్ న్యూస్... ఓ బ్యాడ్ న్యూస్. ఏంటో తెలుసుకోండి.

  • Share this:
ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పెరగనున్న కరవు భత్యం (డియర్నెస్ అలవెన్సు- డీఏ), డీఆర్ అలవెన్సులను.. గతంలో బకాయి ఉన్నప్పటి నుంచి కాకుండా, జూలై 1 నుంచే చెల్లించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో డీఏ బకాయిలు పొందవచ్చని ఊహించిన ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. అయితే గతంతో పోలిస్తే కొంతవరకు పెరిగిన డీఏ, తాజా నిర్ణయం తరువాత 28 శాతానికి చేరుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన కాస్ట్ ఇండెక్షేషన్‌ జూన్ 30న నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా ఇండెక్షేషన్ తరువాతే డీఏ పెరుగుదల అమల్లోకి వస్తుంది. దీని ఆధారంగా జులై 1 నుంచే డీఏ పెంపు నిర్ణయం అమల్లోకి రానుందని అంచనా వేస్తున్నారు.

Aadhaar Card: ఈ ఆధార్ సేవలకు ఇంటర్నెట్ అవసరం లేదు

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ మీకోసమే

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ వస్తోంది. 2019 జూలై నుంచి ఈ రేటు అమల్లో ఉంది. గత ఏదాది జనవరిలోనే దీన్ని సమీక్షించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డీఏ పెంపుపై నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. దీనికి తోడు కరోనా కారణంగా గత ఏడాది జనవరి 1, జూలై 1, ఈ సంవత్సరం జనవరి 1న.. మొత్తం మూడు విడతల్లో చెల్లించాల్సిన డీఏను ఆపేసింది. దీంతో మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. పెంచిన డీఏను గత వాయిదాలకు కలిపి చెల్లిస్తారని ఆశించారు.

EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాలో రెండోసారి కోవిడ్ అడ్వాన్స్ తీసుకోండి ఇలా

EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... ఒక్క రోజులో రూ.1,00,000 విత్‍డ్రా చేయొచ్చు ఇలా

డీఏ పెంపుపై జూన్ చివరి నాటికి కేంద్ర ఆర్థిక శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. సమావేశం జరిగితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచే అవకాశం కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ఈ సమావేశం మే నెలలోనే జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ నెలలో కచ్చితంగా సమావేశం జరుగుతుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

కరోనా మిగిల్చిన సంక్షోభం ప్రభావంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్సులు, డియర్నెస్ రిలీఫ్‌ (డీఆర్) అదనపు వాయిదాలు ఆపేస్తున్నట్లు 2020 ఏప్రిల్ 23న ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే ఈసారి సుమారు 11 శాతం వరకు డీఏను పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు డీఏ పెంచితే, ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి నుండి 28 శాతం వరకు కరవు భత్యం పెరగనుంది. దాదాపు 1.1 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నిర్ణయం లబ్ది చేకూర్చనుంది.
Published by:Santhosh Kumar S
First published: