త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Government Employees) సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గుడ్‌న్యూస్ అందే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance) పెంపుపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్(Fitment Factor) పెంపు, 18 నెలల డీఏ బకాయిల కోసం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. డీఏ బకాయిలు ఏ స్థాయి ఉద్యోగులకు ఎంత అందుతాయనే విషయంపైనా నివేదికలు విశ్లేషణలు చేశాయి. నివేదికలు చెబుతున్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండ్ ఆధారంగా నివేదికలు
డీఏ పెంపు విషయానికొస్తే.. దీపావళి సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం 4 శాతం పెంచింది. దీంతో అంతకుముందు 34 శాతంగా ఉన్న డీఏ 38 శాతానికి పెరిగింది. దీనికి ముందు మార్చి 2022లో డీఏని 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రెండ్‌ను అనుసరించి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ తదుపరి డీఏ పెంపును 2023 మార్చిలో పొందే అవకాశం ఉందని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
3 శాతం నుంచి 5 శాతం వరకు డీఏ పెరిగే అవకాశం
ద్రవ్యోల్బణం(Inflation), 7వ వేతన సంఘం సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 3 నుంచి 5 శాతం పెంచవచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి. డీఏ పెంపు దాదాపు 50 శాతానికి చేరితే, అది సున్నాకి తగ్గుతుందని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు డీఏను సున్నాకి తగ్గించారు. కాబట్టి ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.18,000 అయితే, ఆ ఉద్యోగికి 50 శాతం డీఏ రూ.9000 లభిస్తుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను త్వరలో జారీ చేయనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత డీఏ బకాయిలు(DA Arrears) వస్తాయని భావిస్తున్నారు?
వేర్వేరు ఉద్యోగులకు వేర్వేరు రకాలుగా బకాయిలు ఉన్నాయని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ JCM (స్టాఫ్ సైడ్) శివ గోపాల్ మిశ్రాను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. లెవెల్ 1 కింద ఉద్యోగుల డీఏ బకాయిల పరిధి రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య ఉంటుంది. మరోవైపు 7వ వేతన సవరణ సంఘం కింద లెవెల్-13, లెవెల్-14 పే స్కేల్లో గరిష్ట బేసిక్ శాలరీ ఉన్నవారు వరుసగా రూ.1,23,100 నుంచి రూ.2,15,900, రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.