కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండగకు ముందే కేంద్రం ఓ శుభవార్త చెప్పేంది. గతేడాది మార్చి 25న కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్న పలువురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి తమ కార్యాలయాలకు చేరుకోలేకపోయారు. లాక్డౌన్ వల్ల వారు ఈ సమస్యను ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో వారు విధులకు హాజరుకానట్టుగా పరిగణించబడ్డారు. అయితే అలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఓ చిన్న శుభవార్త చెప్పింది. వారికి ఊరట కల్పించేలా కొన్ని నిబంధనలతో మార్చి 1న డీఓపీటీ ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ విషయానికి సంబంధించి 28-07-2020న ఇప్పటికే కేంద్ర నోటిఫికేషన్ జారీ చేసిందని.. లాక్డౌన్ వల్ల తిరిగి విధుల్లో చేరలేకపోయిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఇది స్వీకరిస్తుందని పేర్కొంది.
"కోవిడ్-19 పరిస్థితుల కారణంగా దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ రంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొటున్న అనివార్యమైన సమస్యల దృష్ట్యా 28-07-2020న Office Memorandum జారీచేయడం జరిగింది. ఇందులో కోవిడ్ పరిస్థితుల కారణంగా ఉద్యోగుల ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను కవర్ చేయడానికి ఇందులో ఓ జనరల్ టెర్మినాలజీని అవలంభించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని నిర్ధిష్ట సమస్యలను పొందుపరచకపోయినప్పటికీ.. అటువంటి పరిస్థితులకు సమానమైన వివరణ ఇందులో స్పష్టంగా ఉంటుంది" అని DoPT వివరించింది.
ఇక, హోలీ కన్నా ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ రిలీఫ్-DR, డియర్నెస్ అలవెన్స్-DA పెంచేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ, డీఆర్ పెంచే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం 65 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు, సుమారు 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.