Home /News /jobs /

Singareni Collieries Jobs: సింగరేణి కాలరీస్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Singareni Collieries Jobs: సింగరేణి కాలరీస్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలోని సెంగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసిటీలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    నిరుద్యోగులకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసిటీలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ సొసైటీకి చెందిన స్కూల్, కళాశాలల్లో మొత్తం 78 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టును భర్తీ చేయనున్నారు. వివిధ పోస్టుల ఆధారంగా అర్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

    అభ్యర్థుల వయస్సు జూలై 1 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు సంస్థ అధికారిక వైబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును నింపిన అనంతరం ‘సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీ (ఎస్‌సీఈఎస్‌), భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-507101, తెలంగాణ‌’ అడ్రెస్ కు పోస్టు లేదా కొరియార్ ద్వారా అందించాల్సి ఉంటుంది.

    డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మొదట 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను మెరిట్ ఆధారంగా షర్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం సూచించిన తేదీలో వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉంటాయని నోటిఫికేషన్లోనే స్పష్టం చేశారు.
    Official Website-Direct Link

    Official Notification-Direct Link
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Singareni Collieries Company

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు