త్వరలోనే 75 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు మోదీ సర్కార్ వరం...

100 రోజుల స్ట్రాటజీని ఏర్పాటు చేసుకుని అన్ని విధాల ప్రజలకు చేరువ కావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగులకి భారీగా ఉద్యోగాల కల్పిస్తామని చెప్పిన మోడీ.. ఆ హామీని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు.

news18-telugu
Updated: May 29, 2019, 6:11 PM IST
త్వరలోనే 75 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు మోదీ సర్కార్ వరం...
త్వరలోనే 75 వేల ఉద్యోగాల నోటిఫికేషన్
  • Share this:
నిరుద్యోగులకు మోదీ సర్కార్ వరం... 70,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు
లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న నరేంద్ర మోడీ జనాలను ఆకర్షించే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 100 రోజుల స్ట్రాటజీని ఏర్పాటు చేసుకుని అన్ని విధాల ప్రజలకు చేరువ కావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగులకి భారీగా ఉద్యోగాల కల్పిస్తామని చెప్పిన మోడీ.. ఆ హామీని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు.

ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన పీఎమ్‌వో వివిధ రంగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు కావాలని ఆయా డిపార్ట్‌మెంట్ మంత్రిత్వ శాఖలను కోరారు. ఇందులో భాగంగానే 75 వేల ఖాళీలున్నాయిని.. వీటిని త్వరగా భర్తీ చేయాలని తేలడంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోడీ త్వరలోనే ఈ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

First published: May 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>