హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

New Jobs With 5G: దేశంలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. 5జీ రాకతో భారీగా జాబ్స్.. వివరాలివే

New Jobs With 5G: దేశంలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. 5జీ రాకతో భారీగా జాబ్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరికొన్ని గంటల్లో దేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 5జీ రాకతో యువతకు భారీగా ఉద్యోగావకాశాలు రానున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  మరికొన్ని గంటల్లో దేశంలో 5జీ సేవలను (5G Services) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో 5G టెక్నాలజీ కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం నాటికి టెలికాం రంగంలో 18,000 నుండి 20,000 ఉద్యోగాలు (Telecom Jobs) సృష్టించబడతాయని పరిశ్రమ అంచనాలు వేస్తున్నాయి. ఇటీవల టెలికాం సెక్రటరీ రాజరామన్ మాట్లాడుతూ.. 5జీ రాక భారీ ఉద్యోగాల కల్పనను తీసుకురానున్నట్లు ప్రకటించారు. భారత టెలికాం సెక్టార్ వివిధ కేటగిరీల్లో భారీగా ఉద్యోగాలను సృష్టించనుందన్నారు. ఈ జులై-సెప్టెంబర్ త్రైమార్షికంలో టెలికాం సెక్టార్ 6 వేల కొత్త ఉద్యోగాలను అందించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.నూతన 5జీ సాంకేతికత కారణంగా 2025 నాటికి దేశంలో రెండు కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టెలికాం టెక్నాలజీ స్కిల్ కౌన్సిల్ ( టీఎస్‌ఎస్‌సీ) అంచనా వేస్తోంది.

  కొన్ని నెలల క్రితం జరిగిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 5జీ సాంకేతిక కేవలం వేగవంతమైన నెట్వర్క్ ను అందించడం మాత్రమే కాకుండా.. దేశ ఆర్థిక ఉన్నతికి సైతం దోహదపడుతుందన్నారు.

  Major Benefits of 5G: నేటి నుంచే దేశంలో 5జీ సేవలు.. ఈ సేవల్లో ఊహించని మార్పులు.. ఓ లుక్కేయండి

  ఇంకా ఉద్యోగ కల్పనకు కూడా కారణం కానుందన్నారు. భారతదేశం 5Gకి మారుతూనే 6Gకి సిద్ధమవుతోందని మోడీ చెప్పారు. భారతదేశం 2G, 3G మరియు నెక్ట్స్ జనరేషన్ నెట్‌వర్క్ టెక్నాలజీలకు సజావుగా అప్ గ్రేడ్ అయ్యేలా TRAI చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని అభినందించారు. దేశంలో 5G నెట్‌వర్క్‌లను వేగంగా రోల్ అవుట్ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: 5G, 5g technology, JOBS, Pm modi, Telecom, TRAI

  ఉత్తమ కథలు