హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

2022 IT Jobs: ఐటీ ఉద్యోగం మీ కలా..? 2022లో దానిని సాకారం చేసుకోవచ్చు.. ఎలా అంటే..

2022 IT Jobs: ఐటీ ఉద్యోగం మీ కలా..? 2022లో దానిని సాకారం చేసుకోవచ్చు.. ఎలా అంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2022 IT Jobs: మీరు ఐటీ సెక్టార్​లో కెరీర్​ను కోరుకుంటే.. 2022లో ఈ కోర్సులను నేర్చుకోండి. ఈ లేటెస్ట్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా ఐటీ రంగంలో భారీ ప్యాకేజీలతో ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

కరోనా(Corona) ప్రతికూల పరిస్థితుల్లోనూ ఐటీ రంగం(Information Technology) వేగంగా వృద్ధి చెందుతోంది. 2021లో ఇతర రంగాలతో పోలిస్తే అత్యధిక ఉద్యోగాలు(Jobs) కల్పించిన రంగంలా ఐటీ(It) నిలిచింది. 2022లోనూ ఇదే ధోరణి కొనసాగనుందని ఐటీ ఎక్స్​పర్ట్స్(IT Experts) చెబుతున్నారు. కంపెనీలు నైపుణ్యం ఉన్న యువతకు అధిక ప్యాకేజీలు ఇచ్చి మరీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. మీరు ఐటీ సెక్టార్​లో కెరీర్​ను కోరుకుంటే.. 2022లో ఈ కోర్సులను నేర్చుకోండి. ఈ లేటెస్ట్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా ఐటీ రంగంలో భారీ ప్యాకేజీలతో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అందులో మొదటిది సైబర్ సెక్యూరిటీ(Cyber Security)..  స్కిల్‌సాఫ్ట్ 2021 ఐటీ స్కిల్స్​, శాలరీ రిపోర్ట్ ప్రకారం, ఆసియా- పసిఫిక్​ ప్రాంతంలోని 52% ఐటీ కంపెనీలు సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇందు కోసం పెద్ద ఎత్తున సైబర్​ సెక్యూరిటీ ఎక్స్​పర్ట్​లను నియమించుకుంటున్నాయి.

IIT Mentorship: స్కూల్ గర్ల్స్ కోసం STEM మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌.. తాజాగా ప్రారంభించిన ప్రముఖ విద్యాసంస్థ..


క్లౌడ్ కంప్యూటింగ్..

2017 నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ క్లౌడ్​ కంప్యూటింగ్​. అందుకే, క్లౌడ్​ కంప్యూటింగ్​ అవకాశాల వారధిగా నిలుస్తోంది. దాదాపు 43% కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్​కు ప్రాధాన్యతనిస్తున్నాయి. కాబట్టి, డెవోప్స్​, సర్వర్‌లెస్ ఆర్కిటెక్చర్, ఆటోమేషన్, క్యూఏ వంటి క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలను నేర్చుకొని మీ కెరీర్​ను ప్రారంభించండి.

బిగ్ డేటా..

యూజర్లకు సంబంధించిన డేటాను స్టోర్ చేసేందుకు బిగ్​ డేటా అనలిస్ట్​లను నియమించుకుంటున్నాయి ఐటీ సంస్థలు. వీరికి భారీ ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. డేటాను సేకరించడం, విశ్లేషించడం, సురక్షితంగా ఉపయోగించడంపై వీరు పనిచేయాల్సి ఉంటుంది.

Engineering Students: ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ప్రతి నెలా రూ. 7500 స్టైపెండ్​ పొందే అవకాశం.. ఎలా అంటే..


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్​ మెషిన్ లెర్నింగ్..

ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ మెషిన్​ లెర్నింగ్​ మన రోజువారీ జీవితంలో భాగమైంది. అందుకే ఏఐ నిపుణులకు మార్కెట్​లో భారీ డిమాండ్​ ఏర్పడింది. ప్రముఖ ఐటీ సంస్థలు భారీ ప్యాకేజీతో వీరిని నియమించుకుంటున్నాయి.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్..

ఐటీ రంగంలో ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్ ఎక్స్​పర్ట్స్​​కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 2015లో ప్రారంభమైన ఈ టెక్నాలజీ వినియోగం 2021 వరకు మూడు రెట్లు పెరిగింది. ఫలితంగా ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​ (ఐవోటీ) ఇంజనీర్ల అవసరం కూడా పెరిగింది. అయితే, ఐవోటీ టెక్నాలజీలో నిపుణుల కొరత ఐటీ కంపెనీలకు సమస్యగా మారింది. అందుకే, ఈ కోర్సు నేర్చుకున్న వారికి పెద్ద ఎత్తున ప్యాకేజీలు ఆఫర్​ చేస్తున్నాయి. కొత్తగా కెరీర్​ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్లతో పాటు, ఇప్పటికే ఐటీ రంగంలో ఉన్న వారు సైతం నూతన టెక్నాలజీలపై పట్టు సాధిస్తే భారీ వేతనాలు అందుకోవచ్చు.

First published:

Tags: Information Technology, IT jobs, Online classes, Private Jobs

ఉత్తమ కథలు