చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్(Chittaranjan Locomotive Works) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 492 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోనే వారు ముందుగా apprenticeshipindia.org నమోదు చేసుకున్న తరువాత పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి అర్హతలు ఎంపిక విధానం పూర్తిగా నోటిఫికేషన్(Notification) ఆధారంగా జరుగుతాయి. ఎంపిక విధానంలో రిజేర్వేషన్ నియమాలు అన్ని వర్తిస్తాయి. క్యాటగిరీల వారీగా పోస్టుల పంపకం ఉంటుంది. నోటిఫికేషన్లో కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు చూసిన తరువాత దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అనంతరం అప్రెంటీస్ యాక్ట్ ప్రకారం ఒప్పందం ఉంటుంది. దరఖాస్తు చేసుకొనే విధానం, అర్హతల కోసం చదవండి.
అర్హతలు..
- దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి కచ్చితంగా పదో తరగతి, ఇంటర్ చదివి ఉండాలి.
- లేదా కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా (Council of Boards of School Education in India) వద్ద నుంచి సర్టిఫికెట్(Certificate) పొంది ఉండాలి.
- ఐటీఐ పాసై నట్టు ధ్రువీకరణ సర్టిఫికెట్ ఉండాలి.
ఎంపిక విధానం..
- రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఏమీ ఉండవు
- అభ్యర్థి పదో తరగతి మార్కులు(Marks), ఐటీఐ ధ్రువీకరణ ద్వారా ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
- ఉన్నత విద్య చదివిన వారికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండదు. పోస్టు అర్హతే ప్రధానం.
- ఎంపికైన వారిక కాల్ లెటర్స్ అందిస్తారు.
దరఖాస్తు చేసుకొనే విధానం
- అభ్యర్థి ముందుగా apprenticeshipindia.org దరఖాస్తు చేసుకోవాలి. (రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి)
- అక్కడ అవసమైన ధ్రువపత్రాలు అందించాలి.
- ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి అక్టోబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.