హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SECL Recruitment 2021: ఎస్ఈసీఎల్‌లో 450 అప్రెంటీస్ ఖాళీలు

SECL Recruitment 2021: ఎస్ఈసీఎల్‌లో 450 అప్రెంటీస్ ఖాళీలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని అన్నారు. ఎండ వేడిమి సమయంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగిందని.. రోజువారీ వినియోగం 2.5 బిలియన్ యూనిట్లను పరిశీలిస్తే ప్రస్తుతం దాదాపు 3.5 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని అన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని అన్నారు. ఎండ వేడిమి సమయంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగిందని.. రోజువారీ వినియోగం 2.5 బిలియన్ యూనిట్లను పరిశీలిస్తే ప్రస్తుతం దాదాపు 3.5 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని అన్నారు.

సౌత్ ఇస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (South Eastern Coalfields Limited) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్(Notification) ద్వారా 450 గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ లేదా డిప్లొమా అప్రెంటీస్ ఖాళీలు భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...

సౌత్ ఇస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (South Eastern Coalfields Limited) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్(Notification) ద్వారా 450 గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ లేదా డిప్లొమా అప్రెంటీస్ ఖాళీలు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మైనింగ్ ఇంజనీరింగ్‌(Engineering)లో డిగ్రీ లేదా మైనింగ్‌లో డిప్లొమా(Diploma) చేసి ఉండాలి. లేదా గని సర్వేయింగ్‌లో డిప్ల‌మా చేసి ఉండాలి. ఈ పోస్టుకు 2014 వరకు సవరించిన అప్రెంటీస్ చట్టం 1961 కింద ఓపెన్‌కాస్ట్ లేదా భూగర్భ గనుల్లో ఒక సంవత్సరం శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీలకు నెలకు రూ .9,000 స్టైఫండ్ చెల్లించబడుతుంది మరియు టెక్నీషియన్(Technician) అప్రెంటీస్ ఖాళీల కోసం ఎంపికైన వారికి రూ .8,000 నెలవారీ స్టైఫండ్ చెల్లించబడుతుంది.

పోస్టు పేరుఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ మైనింగ్140
టెక్నికల్ అప్రెంటీస్ మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్310


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..

- ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్యర్థి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ కోసం మైనింగ్ ఇంజనీరింగ్‌లో నాలుగు సంవత్సరాల డిగ్రీని కలిగి ఉండాలి,

- టెక్నిషియన్ అప్రెంటీస్‌షిప్ లేదా భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఒక సంస్థ మంజూరు చేసిన మైనింగ్(Mining) ఇంజనీరింగ్ లేదా గని సర్వేయింగ్‌(Surveying)లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.

- ఈ అప్రెంటీస్‌షిప్ స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మరే ఇతర సంస్థలో అప్రెంటీస్‌షిప్ శిక్షణ పొందకూడదు.

Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే


ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

ఆసక్తి, ర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబ‌ర్ 5, 2021 లోపు అప్రెంటీస్‌షిప్ పోర్టల్ www.mhrdnats.gov.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు మొదట NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి:

- ముందుగా www.mhrdnats.gov.in. వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.

- అక్క‌డ నమోదుపై క్లిక్ చేయండి.  (లాగిన్ కోసం క్లిక్ చేయండి)

- దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థికి ఓ రిజిస్ట‌ర్ నంబ‌ర్ వ‌స్తుంది.

- న‌మోదు ధ్రువీక‌ర‌ణ కోసం ఒక రోజు ఎదురుచూడాలి

- రిజిస్ట‌ర్ నంబ‌ర్ పొందిన త‌రువాత ద‌ర‌ఖాస్తు చుసుకోవాలి.

రిజ‌స్ట‌ర్ నంబ‌ర్ త‌రువాత ద‌ర‌ఖాస్తు చేసుకొనే ప్ర‌క్రియ‌

- రిజిస్ట‌ర్ నంబ‌ర్‌తో లాగిన్ అవ్వాలి.

- అనంత‌రం ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ మెనూపై క్లిక్ చేయండి

- అనంత‌రం రెజ్యూమెను అప్‌లోడ్ చేయాలి.

- అనంత‌రం ఎస్టాబ్లిష్‌మెంట్ పేరును ఎంచుకోండి

- అప్పుడు "సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్" అని టైప్ చేస్తే మీకు లింక్ వ‌స్తుంది.

- అప్పుడు అక్క‌డ క్లిక్ చేయాలి.

- అనంత‌రం స‌బ్‌మిట్ కొట్టాలి.

First published:

Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, JOBS

ఉత్తమ కథలు