ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్ లేదా ఫెలోషిప్‌లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వారు ఉన్నత చదువులు చదివేందుకు ఉపయోగపడతాయి. వారిలో నైపుణ్యాలు పెంపొందించుకోవడంతో పాటు కెరీర్ అవకాశాలను కూడా పెంచుతాయి. రాష్ర్ట, జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులకు, ప్రతిభావంతులైన ఉన్నత విద్యావంతులకు కొన్ని సంస్థలు స్కాలర్‌షిప్ ఇస్తున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం..
కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్
కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ యువ క్రీడాకారులు తమ ఎడ్యుకేషన్ గోల్స్ రీచ్ అవ్వడానికి కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషనల్ స్కాలర్‌షిప్, మెంటర్‌షిప్ ప్రోగ్రాం కింద ఈ స్కాలర్‌షిప్ ఇస్తుంది. దీని కోసం అప్లై చేసేవారు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పేద విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వడం లేదా బోధించిన అనుభవం ఉండాలి. గత 2, 3 సంవత్సరాలలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉండాలి. రాష్ర్ట స్థాయి ర్యాంకింగ్స్‌లో 100లోపు లేదా జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో 500లోపు ఉండాలి.
దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలకు మించకూడదు. 9 నుంచి 20 ఏళ్ల మధ్య క్రీడాకారులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. www.b4s.in/it/KSSI2 లింక్‌లో ఆన్‌లైన్ విధానంలో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.75,000 చొప్పున మూడేళ్ల పాటు స్కాలర్ ఇస్తారు.
గాంధీ ఫెలోషిప్ 2023
పిరమల్ ఫౌండేషన్ అనే ఎన్‌జీవో (NGO) ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు గాంధీ ఫెలోషిప్ 2023 కింద ప్రోత్సాహకాలు ఇస్తుంది. 18 నుంచి 26 ఏళ్ల మధ్య వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. చదువులో ప్రతిభావంతులు లేదా క్రీడలు, ఎన్‌ఎస్‌ఎస్ (NSS), ఎన్‌సీసీ (NCC), వాలంటరీ వర్క్ చేసిన వాళ్లు, సాహిత్యం, కళల్లో ఔత్సాహికులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఆసక్తి ఉన్నవారు https://gandhifellowship.creatrixcampus.com/admissionregistration/default/create లింక్‌లో మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. సెలక్ట్ అయిన వారికి వారు ఉండే ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.25,000 నుంచి రూ.28,000 స్టైపెండ్ ఇస్తారు.
గ్లోబల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
AIS టెక్నోలాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కన్సల్టింగ్ కంపెనీ.. గ్లోబల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ - AIS 2023ను నిర్వహిస్తోంది. అకడమిక్‌లో అన్ని సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరిచిన వాళ్లు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ దేశంలో ఉన్న భారతీయులు అయినా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. ప్రపంచంలో గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు దరఖాస్తు చేసి ఉండాలి. సంబంధిత కోర్సులో కనీసం ఒక టర్మ్ పూర్తి చేసి ఉండాలి. కాలేజీ డ్రాప్ అవుట్లు కాకూడదు. https://www.aistechnolabs.com/ వెబ్‌సైట్‌లో మే 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెలక్ట్ అయిన వారికి 2 సంవత్సరాల వరకు ఇయర్లీ స్కాలర్‌షిప్ ఇస్తారు.
ONGC స్పోర్ట్స్ స్కాలర్‌షిప్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన కార్పొరేట్ స్పోర్ట్స్ డివిజన్ 2023- 24 సంవత్సరానికి గాను ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ను ఇస్తుంది. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను కోసం దీన్ని ఇస్తున్నారు. అప్లై చేసేవారు 14 నుంచి 25 ఏళ్లు గల గల భారతీయ క్రీడాకారులు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 1 నాటికి 14 ఏళ్లు పూర్తయ్యి ఉండాలి. చెస్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ క్రీడాకారుల కనీస వయస్సు 10 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఇతర స్కాలర్‌షిప్ లేదా స్టైఫండ్ తీసుకోకూడదు. మార్చి 27వ తేదీలోగా సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.ongcindia.com/లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 స్కాలర్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Fellowship, JOBS, Scholarships