ఎడ్యుకేషన్ రంగంలో సమూల మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని (NEP) తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థులకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్‌ను పూర్తిగా ఆన్లైన్ మోడ్‌లో (Online Education) అందించడానికి నేషనల్ డిజిటల్ యూనివర్సిటీని (Digital University) ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనివర్సిటీ కార్యకలాపాల కోసం తాజాగా నాలుగు సెంట్రల్ యూనివర్సిటీలను ఎంపిక చేశారు. అంటే ఇది పని చేయాల్సిన హబ్ లేదా లొకేషన్, కార్యకలాపాలను ఈ వర్సిటీలు గుర్తించనున్నాయి.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్ ఆధారంగా..
డిజిటల్ యూనివర్సిటీ యాక్టివిటీస్ కోసం ఎంపిక చేసిన సెంట్రల్ యూనివర్సిటీల జాబితాలో ఐఐటీ మద్రాస్, ఢిల్లీ యూనివర్సిటీ(DU), బనారస్ హిందూ యూనివర్సిటీ(BHU), ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)లు ఉన్నాయి. వీటిని ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) ర్యాకింగ్ ప్రకారం ఎంపిక చేశారు.
Strange Rules: ఈ స్కూళ్లలో వింత రూల్స్.. ఫ్రెండ్షిప్ చేయడం, చప్పట్లు కొట్టడం కూడా నిషేధం..
హబ్ అండ్ స్పోక్ మోడల్లో..
వచ్చే అకడమిక్ సెషన్ నుంచి కొత్త డిజిటల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ(MoE), యూజీసీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ డిగ్రీలతోపాటు ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్లో ప్రోగ్రామ్‌లను టాప్ యూనివర్సిటీలు, కాలేజీల ద్వారా డెలివరీ చేయనుంది.
వివిధ ఫార్మాట్లలో పరీక్షలు..
ఈ డిజిటల్ యూనివర్సిటీ ప్రత్యేకమైన కోర్సులను అందించనుంది. ఈ వర్సిటీలో చేరిన విద్యార్థులకు పరీక్షలు, అసెస్మెంట్ను వివిధ ఫార్మాట్లలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో డిజిటల్ వర్సిటీ అడ్మిషన్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, అడ్మిషన్‌కు సంబంధించిన ప్రమాణాలను ఇంకా నిర్ణయించలేదు.
మల్టిపుల్ ఎంట్రీస్- ఎగ్జిట్స్
ఈ ఏడాది సెప్టెంబర్‌లో 13వ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ జరిగింది. ఈవెంట్లో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. మల్టిపుల్ ఎంట్రీస్- ఎగ్జిట్స్ ఫ్రేమ్‌వర్క్‌లతో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
నాలుగిటిలో ఒకదాన్ని హబ్‌గా..
నాలుగు ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీ మద్రాస్, ఢిల్లీ యూనివర్సిటీ(DU), బనారస్ హిందూ యూనివర్సిటీ(BHU), ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ల్లో ఒకదాన్ని డిజిటల్ యూనివర్సిటీ హబ్‌గా ఖరారు చేసేందుకు ఈనెలాఖరులో చర్చలు జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ అధికారుల్లో ఒకరు తెలిపారు. ‘డిజిటల్ యూనివర్సిటీ కోసం ఈ నాలుగు సెంట్రల్ యూనివర్సిటీలను వాటి సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేశాం. బెనారస్ హిందూ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి వాటి కోసం ప్రోగ్రామ్స్‌ను డెలివరీ చేయడంలో ఐఐటీ టెక్నాలజీ, లార్జ్ ఆపరేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడనుంది.’ అని సదరు అధికారి చెప్పుకొచ్చారు.
కాగా, దేశంలోని మారుమూల ప్రాంత విద్యార్థులకు సైతం ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించడం కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , ఈ ఏడాది ఫిబ్రవరి1న కేంద్ర బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Digital university, EDUCATION, JOBS