NVS Jobs: ఎన్‌వీఎస్‌లో 370 టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Navodaya Vidyalaya Samiti Teacher Recruitment | మహారాష్ట్ర, గోవా, గుజరాత్, డామన్ అండ్ డయ్యు, దాద్రా అండ్ నగర్ హవేలీలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది నవోదయ విద్యాలయ సమితి.

news18-telugu
Updated: June 3, 2019, 3:53 PM IST
NVS Jobs: ఎన్‌వీఎస్‌లో 370 టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
NVS Jobs: ఎన్‌వీఎస్‌లో 370 టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 3, 2019, 3:53 PM IST
టీచర్ ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. పూణెలోని నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఇతర పోస్టుల భర్తీకి  దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 370 ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో 128 పీజీటీ, 172 టీజీటీ, 70 ఇతర పోస్టులు. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, డామన్ అండ్ డయ్యు, దాద్రా అండ్ నగర్ హవేలీలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది నవోదయ విద్యాలయ సమితి. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 5 లోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Navodaya Vidyalaya Samiti: ఖాళీల వివరాలు ఇవే


మొత్తం పోస్టులు- 370

పీజీటీ (హిందీ)- 24
పీజీటీ (ఇంగ్లీష్)- 9
పీజీటీ (బయాలజీ)- 18


పీజీటీ (కెమిస్ట్రీ)- 18
Loading...
పీజీటీ (ఫిజిక్స్)- 23
పీజీటీ (జాగ్రఫీ)- 12
పీజీటీ (హిస్టరీ- 10
పీజీటీ (మ్యాథ్స్)- 8
పీజీటీ (కామర్స్)- 1
పీజీటీ (ఎకనమిక్స్)- 4
పీజీటీ (ఐటీ)- 1
టీజీటీ (మ్యాథ్స్)- 36
టీజీటీ (హిందీ)- 36
టీజీటీ (ఇంగ్లీష్)- 11
టీజీటీ (సైన్స్)- 17
టీజీటీ (సోషల్ స్టడీస్)- 18
టీజీటీ (మరాఠీ)- 5
టీజీటీ (గుజరాతీ)- 4
టీజీటీ (మ్యూజిక్)- 7
టీజీటీ (ఆర్ట్స్)- 14
పీఈటీ (మేల్)- 16
పీఈటీ (ఫీమేల్)- 06
లైబ్రేరియన్ - 04
ఎఫ్‌సీఎస్‌ఏ- 70

Navodaya Vidyalaya Samiti: విద్యార్హతలు, వేతనాల వివరాలు


పీజీటీ: ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్‌లో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. బీఈడీ ఉండాలి. వేతనం రూ.27,500.
టీజీటీ: సంబంధిత సబ్జెక్ట్‌లో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు చదవాలి. 50 శాతం మార్కులతో బీఈడీ పాస్ కావాలి. వేతనం రూ.26,250.
ఎఫ్‌సీఎస్ఏ: కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా, DOEACC నుంచి A లెవెల్ సర్టిఫికెట్, బీసీఏ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బీఈ చదవాలి. వేతనం రూ.26,250.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

SSC MTS Jobs: 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... సిలబస్ ఇదే
First published: June 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...