Home /News /jobs /

3 SCHOLARSHIP AND FELLOWSHIP PROGRAMMES YOU CAN APPLY FOR BY NOV 30 GH VB

Scholarships: ఈ మూడు ప్రధాన స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు తుది గడువు నవంబర్ 30.. అప్లై చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతిభ ఉన్న విద్యార్థి ఆటంకం లేకుండా చదువులు కొనసాగించేందుకు స్కాలర్‌షిప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. అవి సదరు విద్యార్థి లక్ష్యాల్ని, ఆశయాలను అందుకోవడానికి సహాయపడతాయి.

ప్రతిభ ఉన్న విద్యార్థి ఆటంకం లేకుండా చదువులు కొనసాగించేందుకు స్కాలర్‌షిప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. అవి సదరు విద్యార్థి లక్ష్యాల్ని, ఆశయాలను అందుకోవడానికి సహాయపడతాయి. మంచి స్కాలర్‌షిప్‌లు విద్యార్థి కెరీర్ దశను, జీవిత మార్గాన్ని నిర్ధారించే శక్తి కలిగి ఉంటాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో వేలాది మంది విద్యార్థులు విద్యాపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది చదువుకు కూడా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ తల్లిదండ్రుల మరణాల వల్ల కానీ వారి ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్నత విద్యకు స్వస్తి చెప్పాలా అనే ఆలోచనలో చాలా మంది పడిపోయారు.

Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


ఈ క్రమంలో ఒక మూడు స్కాలర్‌షిప్‌లు వారికి ఆశాజ్యోతిగా కనిపిస్తున్నాయి. నవంబర్ 30, 2021 నాటికి మీరు దరఖాస్తు చేసుకోగల మూడు ప్రధాన స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను చూడండి.

1. కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021-22
కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ యువ విద్యార్థులకు చదువుల కోసం స్కాలర్‌షిప్‌లను అందించడం ద్వారా వారి విద్య/ కెరీర్ ఆకాంక్షలను కొనసాగించే అవకాశాన్ని అందిస్తోంది. కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ పేరుతో అందించే స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వివిధ పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

Google Home Remote: ఆండ్రాయిడ్ యూజర్లకు మరో యాప్ బేస్డ్ గూగుల్ టీవీ రిమోట్‌ ఆప్షన్.. వివరాలివే..


అర్హతలు...
2021 బోర్డు పరీక్షలలో కనీసం 75% మార్కులతో 10వ తరగతి లేదా 12వ తరగతిలో కనీసం 60% మార్కులతో వారి హయ్యర్ సెకండరీ, 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. దరఖాస్తుదారులందరి కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. ఎంపికైన స్కాలర్స్ వారి ప్రస్తుత విద్యా స్థాయిని బట్టి 3 సంవత్సరారు రూ.30,000 చొప్పున స్కాలర్‌షిప్‌ను పొందవచ్చు.

దీనికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-11-2021

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ అప్లికేషన్‌లు మాత్రమే

Url: www.b4s.in/it/KISF1

Chief Minister KCR: దళితులకు గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.250 కోట్లు విడుదల..


2. నికాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021-22
నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఫోటోగ్రఫీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి (12వ తరగతి ఉత్తీర్ణులు) స్కాలర్‌షిప్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హతలు...
3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఫోటోగ్రఫీ కోర్సులు (12వ తరగతి ఉత్తీర్ణత) అభ్యసించే విద్యార్థులు అర్హులు.

ఎంపికైన వారు సంవత్సరానికి లక్ష రూపాయల వరకు స్కాలర్‌షిప్‌ పొందవచ్చు.

Railway Zone: టికెట్ లేని ప్రయాణికుల నుంచి.. ఎన్ని రూ. కోట్లు వసూలు చేశారో తెలుసా..


దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-11-2021

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ అప్లికేషన్‌లు మాత్రమే

Url: www.b4s.in/it/NSP5

3. కొవిడ్ క్రైసిస్ (జ్యోతి ప్రకాశ్) సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021
కొవిడ్ క్రైసిస్ (జ్యోతి ప్రకాశ్) సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.. కరోనా మహమ్మారి సంక్షోభం కారణంగా తదుపరి విద్యకు తక్కువ లేదా ఆర్థిక సహాయం లేని వారి కుటుంబంలోని బలహీనమైన పిల్లలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

RBI Circular: ఆర్​బీఐ కీలక నిర్ణయం.. కస్టమర్లకు, బ్యాంకులకు కీలక ఆదేశాలు..


అర్హతలు..
1వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ఉపయోగడనుంది. జనవరి 2020 నుంచి తల్లిదండ్రులు/సంపాదిస్తున్న కుటుంబ సభ్యుడిని కోల్పోవడం లేదా సంపాదించే కుటుంబ సభ్యుడు ఉద్యోగం కోల్పోవడం వంటి ఏవైనా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నవారు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డిసెంబర్ 2, 2021 పెళ్లి ముహూర్తం.. కాబోయే భర్త ఆమెతో ఆ ఒక్క మాట అన్నాడు.. ముగింపు ఊహించలేకపోయాడు..


ఎంపికైన వారు సంవత్సరానికి గరిష్టంగా 30,000 రూపాయలు, మెంటర్‌షిప్ ప్రయోజనాలు పొందవచ్చు.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-11-2021

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ అప్లికేషన్‌లు మాత్రమే

Url: www.b4s.in/it/CCSP1
Published by:Veera Babu
First published:

Tags: Scholarship

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు