తెలంగాణ(Telangana) డిపార్ట్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ (Telangana Department of Women Development & Child Welfare) లో అంగన్వాడీ ఎక్సెటెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులు వరంగల్ (Warangal) జిల్లాలో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 275 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా అంగన్వాడీ టీచర్లు, కో ఆర్డినేటర్లు (Co-Ordinaters), ఇన్స్ట్రక్టర్లు, కాంట్రాక్టు సూపర్ వైజర్ (Supervisors) కూడా వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ నవంబర్ 27, 2021 వరకు అవకాశం ఉంది. నోటిఫికేషన్, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్సైట్ https://wdcw.tg.nic.in/ ను సందర్శించాలి.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు..
జోన్ | ఖాళీల సంఖ్య |
కాళేశ్వరం | 56 |
బాసర | 68 |
రాజన్న | 72 |
భద్రాది | 79 |
మొత్తం | 275 |
Railway Apprentice: రైల్వేలో 1785 అప్రెంటీస్ ఉద్యోగాలు.. అర్హతలు, దరఖాస్తు విధానం
అర్హతలు..
- దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
- విద్యార్హత పదోతరగతి పాసవ్వాలి.
- అంగన్వాడీ టీచర్లు, కో ఆర్డినేటర్లు (Co-Ordinaters), ఇన్స్ట్రక్టర్లు, కాంట్రాక్టు సూపర్ వైజర్ (Supervisors) కూడా వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
CSIR Jobs: సీఎస్ఐఆర్లో వేర్వేరు విభాగాల్లో 79 ఉద్యోగాలు.. అర్హతలు దరఖాస్తు వివరాలు
దరఖాస్తు చేసుకొనే విధానం..
Step-1 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://tswdcw.in/ ను సందర్శించాలి.
Step-2 : అక్కడ Detailed Notification క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step-3 : అనంతరం Apply Online ఆప్షన్పై క్లిక్ చేయాలి.
Step-4 : అనంతరం Click here to pay Amount ఆప్షన్ క్లిక్ చేయాలి.
Step-5 : ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తు రుసం రూ.200 ఉంటుంది.
WhatsApp: వాట్సాప్లో రెండు కొత్త ఫీచర్లు.. అవేంటి? ఎలా పనిచేస్తాయి? ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
Step-6 : అనంతరం చెల్లింపు పూర్తయిన తరువాత Click Here if amount paid already ఆప్షన్ క్లిక్ చేయాలి.
Step-7 : అనంతరం అప్లికేషన్ ఫాంను తప్పులు లేకుండా పూర్తి చేయాలి.
Step-8 : సబ్మిట్ చేసిన అనంతరం రసీదు వస్తుంది. దాన్ని భద్ర పరుచుకోవాలి.
Step-9 : దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 27, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, Job notification, Telangana