గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(Garden Reach Shipbuilders and Engineers Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జీఆర్ఎస్ఈ నోటిఫికేషన్ ద్వారా 256 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ మరియు టెక్నీషియన్(Technician) అప్రెంటీస్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 1, 2021 వరకు అవకాశం ఉంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ఒప్పందం(Contract) ప్రకారం కాలపరిమితి ఉంటుంది. జీతం కూడా కాంట్రాక్టు సమయంలో పేర్కొన్న విధంగా ఉంటుంది.
అర్హతలు.. ఖాళీలు
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు |
ట్రేడ్ అప్రెంటీస్ | 170 | ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) లో ఉత్తీర్ణులై ఉండాలి |
ట్రేడ్ అప్రెంటీస్ (ఫ్రెషర్) | 40 | పదో తరగతి పాసై ఉండాలి. |
గ్రాడ్యుయేట్ అప్రంటీస్ | 16 | ఇంజనీరింగ్(Engineering) లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. |
టెక్నికల్ అప్రెంటీస్ | 30 | ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. |
పోస్టుల వారిగా వయోపరిమితి
పోస్టు పేరు | వయోపరిమితి |
ట్రేడ్ అప్రెంటీస్ | 14-25 ఏళ్లు |
ట్రేడ్ అప్రెంటీస్ (ఫ్రెషర్) | 14-20 ఏళ్లు |
గ్రాడ్యుయేట్ అప్రంటీస్ | 14-26 ఏళ్లు |
టెక్నికల్ అప్రెంటీస్ | 14-26 ఏళ్లు |
ఎంపిక విధానం
- ఎంపిక విధానం కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉంటుంది.
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల నుంచి సంస్థ ఇంటర్వ్యూ(Interview)కి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
- అకడామిక్, అనుభవం ఆధారంగా మాత్రమే ఇంటర్వ్యూకి ఎంపిక(Select) చేస్తారు.
అప్రెంటీస్ దరఖాస్తు కోసం..
- అభ్యర్థులు తమ వివరాలను MSDE వెబ్ పోర్టల్(Portal)లో నమోదు చేసుకోవాలి
- అప్రెంటీస్ నమోదు కోసం క్లిక్ చేయండి
- నమోదు తర్వాత మాత్రమే, అభ్యర్థులు GRSE అప్రెంటిస్ రిక్రూట్మెంట్(Recruitmet)కు అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తు విధానం..
- ముందుగా GRSE అధికారిక నోటిఫికేషన్ pdf ని డౌన్లోడ్ చేయండి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- అర్హత ఉంటే, అర్హతను నిర్ధారించడానికి అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- తరువాత ఆన్లైన్ దరఖాస్తుకు వెళ్లండి (ఆన్లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి)
- ఆన్లైన్ దరఖాస్తులో మీ విద్యార్హత, అనుభవం అందించాలి.
- అవసరమైన పత్రాల స్కాన్(Scan) కాపీలను అప్లోడ్(Upload) చేయాలి.
- నిర్దేశించిన దరఖాస్తు రుసుము చెల్లించండి
- చివరగా, మీ దరఖాస్తును సబ్మిట్(Submit) చేయాలి.
- అనంతరం అప్లికేషన్ ఫాం డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీని దగ్గర దాచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS