IT Jobs: త్వరలో ఐటీ సెక్టార్‌లో 2,50,000 కొత్త ఉద్యోగాలు

IT Career | ఐటీ రంగంలో రాణించడానికి, ఉత్పాదకతను పెంచడానికి ఉద్యోగులకు సరైన గైడెన్స్, శిక్షణ అవసరమని, ఇందుకోసం "సమగ్ర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం" చేపడుతున్నామన్నారు కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రి మహేంద్రనాథ్ పాండే.

news18-telugu
Updated: July 3, 2019, 3:17 PM IST
IT Jobs: త్వరలో ఐటీ సెక్టార్‌లో 2,50,000 కొత్త ఉద్యోగాలు
IT Jobs: త్వరలో ఐటీ సెక్టార్‌లో 2,50,000 కొత్త ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 3, 2019, 3:17 PM IST
రాబోయే కొన్ని నెలల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 2,50,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. వాల్డ్ స్కిల్ ఇండియా-ఇంటర్నేషనల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఛాలెంజ్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న మహేంద్రనాథ్ పాండే... డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారతదేశంలో 2022 నాటికి క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ విలువ రూ.49,000 కోట్లకు చేరడం ఖాయమన్నారు. 2018లో క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ విలువ రూ.17,250 కోట్లు. రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో రాణిస్తున్న దేశాలతో కలిసి పనిచేస్తామని, ఆధునిక విజ్ఞానం, నైపుణ్యంతో నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. ఐటీ రంగంలో రాణించడానికి, ఉత్పాదకతను పెంచడానికి ఉద్యోగులకు సరైన గైడెన్స్, శిక్షణ అవసరమన్నారు. ఇందుకోసం "సమగ్ర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం" చేపడుతున్నామన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్-IOT, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్ లాంటి 52 అంశాల్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల్లో ఆరోగ్యకరమైన పోటీ కనిపిస్తుందన్నారు.

పార్లమెంట్‌లో త్వరలో డేటా ప్రొటెక్షన్ బిల్‌కు ఆమోదముద్ర పడుతుందని నాస్‌కామ్ ఛైర్మన్ కేశవ్ మురుగేష్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీలో 6 లక్షల మంది నిపుణులు ఉన్నారని, రాబోయే 3-4 ఏళ్లలో 20 లక్షల మందికి శిక్షణ ఇస్తామన్నారు. జపాన్, చైనా, బ్రెజిల్, సౌత్ కొరియా, రష్యా, సింగపూర్, బెల్జియమ్, ఐర్లాండ్ దేశాలకు చెందినవాళ్లు నాస్‌కామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ కాంపిటీషన్‌లో పాల్గొన్నారు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా
Loading...
Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... పెళ్లికాని అమ్మాయిలకు మాత్రమే

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా
First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...