హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GATE-2023: 2023 గేట్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. కొత్తగా కొన్ని సబ్జెక్ట్ లకు కూడా.. అవేంటో చూడండి!

GATE-2023: 2023 గేట్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. కొత్తగా కొన్ని సబ్జెక్ట్ లకు కూడా.. అవేంటో చూడండి!

2023 గేట్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. కొత్తగా కొన్ని సబ్జెక్ట్ లకు కూడా.. అవేవో చూడండి!

2023 గేట్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. కొత్తగా కొన్ని సబ్జెక్ట్ లకు కూడా.. అవేవో చూడండి!

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE)- 2023 పరీక్షను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు సదరు ఇన్‌స్టిట్యూట్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఇంకా చదవండి ...

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)- 2023 పరీక్షను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్(Kanpur) నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు సదరు ఇన్‌స్టిట్యూట్ అధికారిక ప్రకటనలో తెలిపింది. గేట్-2023 అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT). మొత్తం 29 సబ్జెక్టులపై పరీక్షలు(Exams) జరుగుతాయి. కొన్ని సబ్జెక్టుల్లో రెండు పేపర్లను సెలక్ట్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్‌ను 2022 సెప్టెంబర్ మొదటి వారంలో తెరవనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టులపై అభ్యర్థుల సమగ్ర అవగాహనను పరీక్షిస్తారు.

అర్హత ప్రమాణాలు

ప్రస్తుతం ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో 3వ సంవతర్సం లేదా ఆపై సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు గేట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే ఇంజినీరింగ్ / టెక్నాలజీ / ఆర్కిటెక్చర్ / సైన్సెస్ / కామర్స్ / ఆర్ట్స్‌లో ఏదైనా ప్రభుత్వ డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:  Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం

గేట్‌ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఐఐటీస్(IITs), ఐఐఎస్‌సీ (IISc) బెంగళూరు వంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు అర్హత సాధిస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా విద్యార్థులు స్కాలర్‌షిప్‌లతో పాటు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ / టెక్నాలజీ / ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక ఆర్ట్స్ అండ్ సైన్స్ బ్రాంచ్‌లలో సంబంధిత డాక్టోరల్ ప్రోగ్రామ్‌లకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తమ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను గేట్ స్కోర్‌ ఆధారంగా చేపడున్నాయి. జాతీయ స్థాయి పరీక్ష అయిన గేట్‌ను కోఆర్డినేషన్ బోర్డ్ (NCB) ఆధ్వర్యంలో IISc బెంగళూరు, మరో ఏడు ఐఐటీలు బొంబాయి, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

మరోవైపు, స్టార్టప్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది ఐఐటీ కాన్పూర్‌. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ సీ3ఐహబ్ (C3iHub).. జులై 16న జరిగిన ఈవెంట్‌లో స్టార్టప్స్ కోసం సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ రెండో బ్యాచ్‌ను (second cohort) ప్రారంభించింది. స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కింద 14 స్టార్టప్‌ల కోసం ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. సైబర్-ఫిజికల్ సిస్టమ్‌లో.. క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమోటివ్స్, మానవరహిత వైమానిక వాహనాల్లో (డ్రోన్‌లు) సైబర్ సెక్యూరిటీ వంటి సమస్యలను అడ్రస్ చేయడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. అలాగే క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ప్రాడక్ట్స్ అండ్ సర్వీస్‌లను డెవలప్ చేసి, తదుపరి తరం సైబర్ సెక్యూరిటీ వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే సీ3ఐహబ్ ప్రధాన లక్ష్యమని ఐఐటీ కాన్పూర్ పేర్కొంది.

First published:

Tags: Engineering course, Gate, IIT, JOBS

ఉత్తమ కథలు