Home /News /jobs /

20 PERCENT WEIGHTAGE GOOD NEWS TO CONTRACT AND OUTSOURCING EMPLOYEES WHO WORKS IN TELANGANA HEALTH DEPARTMENT SK

Telangana Jobs: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పోస్టులకు 20శాతం వెయిటేజీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Jobs: వైద్యారోగ్య శాఖ (Health Department)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు.. త్వరలో చేపట్టనున్న నూతన నియామకాల్లో వారికి 20 శాతం వెయిటేజీని కల్పించింది.

ఇంకా చదవండి ...
    వైద్యారోగ్య శాఖ (Health Department)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు (Good news to Telangana contract outsourcing employees) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు..  త్వరలో చేపట్టనున్న నూతన నియామకాల్లో వారికి 20 శాతం వెయిటేజీని కల్పించింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టులు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంవో, ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, ఎంపీహెచ్‌ఏ(ఫిమేల్‌)/ఏఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2, రేడియోగ్రాఫర్‌, పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌, ఫిజియోథెరపిస్ట్‌‌లు వంటి మొత్తం 13 రకాల పోస్టులకు ఈ వెయిటేజీ వర్తిస్తుంది. గరిష్ఠంగా 20 పాయింట్లు కేటాయిస్తారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC), ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ (MHSRB) నియామకాలకు ఇది వర్తిస్తుంది.  ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు.

    త్వరలో తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (MHSRB) ఆధ్వర్యంలో.... వైద్యారోగ్యశాఖలో 10,028 పోస్టులు భర్తీచేయనున్న సంగతి తెలిసిందే. ఈ నూతన నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. అంతేకాదు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని పలు సర్వీస్‌ నిబంధనలను సైతం సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

    MHSRB ద్వారా నియమించే పోస్టులను నాలుగు క్యాటగిరీలుగా విభజించింది. స్పెషలిస్ట్‌ డాక్టర్లు, ఎంబీబీఎస్‌ డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, ఎంపీహెచ్‌ఏ/ఏఎన్‌ఎంగా విభజించి.. ఒక్కో క్యాటగిరీకి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. మొదటి రెండు క్యాటగిరీల్లోని పోస్టులకు మార్కుల ఆధారంగా నేరుగా నియామకాలు చేపడతారు. మిగతా రెండు క్యాటగిరీలకు మాత్రం ప్రవేశపరీక్ష ఉంటుంది. అన్ని క్యాటగిరీల్లో 20 పాయింట్లను/మార్కులను కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వెయిటేజీగా ఇస్తారు.



    కేటగిరీ-1:

    స్పెషలిస్ట్‌ డాక్టర్లు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టులు.

    పీజీ లేదా సూపర్‌ స్పెషాల్టీ కోర్సులో సాధించిన మార్కులను పాయింట్లుగా మారుస్తారు. గరిష్ఠంగా 80 పాయింట్లు ఇస్తారు. కొన్ని యూనివర్సిటీల్లో మార్కులు కాకుండా గ్రేడింగ్ ఉంటుంది.   ఏ గ్రేడ్‌ లేదా ఎక్సలెంట్‌  వస్తే 60 శాతం మార్కులుగా, బీ గ్రేడ్‌ లేదా గుడ్‌ వస్తే 55 శాతం, మిగతా గ్రేడ్‌లకు 50 శాతం మార్కులు ఇస్తారు.

    కేటగిరీ-2:

    ఎంబీబీఎస్‌ డాక్టర్లు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంవో.

    ఎంబీబీఎస్‌లో సాధించిన మార్కులను పాయింట్లుగా మార్చుతారు.  గరిష్ఠంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివి వచ్చినవారికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్వహించే ‘ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌’ (ఎఫ్‌ఎంజీఈ)లో సాధించిన మార్కులను పాయింట్లుగా మార్చి కేటాయిస్తారు.

    BJP|TRS : జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు మోదీ రాజకీయ సూచనలు .. కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

    క్యాటగిరీ-3:
    స్టాఫ్‌ నర్సులు

    క్యాటగిరీ-4:
    ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్‌)/ఏఎన్‌ఎం

    క్యాటగిరీ-3, క్యాటగిరీ-4 పోస్టులకు..  మల్టిపుల్‌ చాయిస్‌ రూపంలో 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. మిగతా 20 మార్కులు వెయిటేజీ రూపంలో లభిస్తాయి.

     అనుభవ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి:
    వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ అనుభవమున్న అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం  (Experience Certificate) తీసుకోవాలి. అధికారులు ఈ దరఖాస్తులను 15 రోజుల్లోగా ఆమోదించి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి లేదా తిరస్కరించాలి. అభ్యర్థులు ఈ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


    Free Coaching: ఎంసెట్‌, ఐఐటీ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఉచిత కోచింగ్ అందిస్తున్న ప్ర‌భుత్వం

    ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు అభ్యర్థులకు వారు సేవలు అందించిన ప్రతి 6 నెలల అనుభవానికి వెయిటేజీ పాయింట్లను కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 పాయింట్ల చొప్పున.. గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. వారు కనీసం 6 నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటేనే వెయిటేజీ వర్తిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..  గతంలో పనిచేసిన హోదాకే.. ఇప్పుడు కూడా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వెయిటేజీ వర్తిస్తుంది.  ఉదాహరణకు ఒకరు గతంలో ఏఎన్‌ఎంగా కాంట్రాక్ట్‌ లేదా ఔట్‌సోర్సింగ్‌గా పనిచేసి.. ఇప్పుడు స్టాఫ్‌ నర్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వెయిటేజీ వర్తించదు. ఏఎన్ఎంకి దరఖాస్తు చేస్తేనే వెయిటేజీ వస్తుంది.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Health, Telangana, Telangana jobs

    తదుపరి వార్తలు